News May 19, 2024
ఖమ్మం: గ్రూప్-1 ప్రిలిమినరీకి 27,475 మంది

జూన్ 9న జరిగే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలపై టీజీపీఎస్సీ ఛైర్మన్ మహేందర్రెడ్డి హైదరాబాద్ నుంచి నిర్వహించిన కాన్ఫరెన్స్కు ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్లు హాజరయ్యారు. మొత్తం 27,475 మంది 73 కేంద్రాలలో పరీక్ష రాయనున్నట్లు వివరించారు. జూన్ 9న ఉదయం 10-30నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది. ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా పరీక్ష జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఛైర్మన్ తెలిపారు.
Similar News
News November 2, 2025
సెలవులపై వెళ్లిన ఖమ్మం కలెక్టర్

ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి వ్యక్తిగత సెలవులో వెళ్తున్నారు. నేటి నుంచి వారం పాటు ఆయన సెలవులో ఉంటారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. తిరిగి కలెక్టర్ 10వ తేదీన విధుల్లో చేరతారు. అప్పటి వరకు అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ ఇన్చార్జి కలెక్టర్ గా వ్యవహరించనున్నారు.
News November 2, 2025
ఖమ్మం: ఈనెల 15న సూపర్ లోక్ అదాలత్

పెండింగ్ కేసుల పరిష్కారమే లక్ష్యంగా ఈనెల 15న సూపర్ లోక్ ఆదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా జడ్జీ జి.రాజగోపాల్ తెలిపారు. ఖమ్మం జిల్లా కోర్టులో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక లోక్ అదాలత్ ద్వారా సోమవారం నుంచి ఈనెల 15వ తేదీ వరకు చెక్ బౌన్స్ కేసులు, రోడ్డు ప్రమాద బీమా కేసులు, రాజీ పడదగిన సివిల్, క్రిమినల్ కేసులను పరిష్కరించుకోవచ్చని వెల్లడించారు.
News November 1, 2025
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్

వర్ష ప్రభావంతో వరద చేరే లోతట్టు ప్రాంతాల ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించి శాశ్వత పరిష్కారానికి పకడ్బందీ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అనుదీప్ అన్నారు. శనివారం మధిరలోని లోతట్టు ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటించారు. పెద్దచెరువు బ్యాక్ వాటర్ ప్రభావం వలన లోతట్టు ప్రాంతాల వరద నియంత్రణకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను పూర్తి చేయాలన్నారు.


