News July 8, 2024

ఖమ్మం: గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో తండ్రీకొడుకులు క్వాలిఫై

image

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌‌లో తండ్రీకొడుకులు అర్హత సాధించారు. దాసరి రవికిరణ్‌ ముచ్చర్ల-జాస్తిపల్లి ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. తనయుడు ఇమ్మానియేలు (25) డిస్టెన్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. 53 ఏళ్ల వయస్సులో రవికిరణ్‌ తనయుడికి సూచనలు ఇవ్వడంతోపాటు తానూ పరీక్ష రాశారు. రిజర్వేషన్, ఇన్‌ సర్వీసు కోటాలో వయో మినహాయింపు ఉండటంతో పరీక్ష రాయగలిగినట్టు వివరించారు.

Similar News

News December 11, 2024

‘ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ కొరకు దరఖాస్తు చేసుకోవాలి’

image

ఖమ్మం: ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ కోసం ఈ పాస్ వెబ్సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి కస్తాల సత్యనారాయణ అన్నారు. 5 నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న వారికి న్యూ స్కీం క్రింద బాలురకు సం.కి రూ.1,000, బాలికలకు సం.కి రూ.1,500, రాజీవ్ విద్య దీవెన క్రింద 9, 10వ తరగతి చదివే విద్యార్థులకు సం.కి రూ.3 వేలు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు.

News December 10, 2024

ఆ సాగు ప్రోత్సాహానికి కేంద్రం తీసుకుంటున్న చర్యలేంటి?: ఎంపీ

image

ఖమ్మం: పామాయిల్ పంట సాగు ప్రోత్సాహానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది..? అని ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి లోక్ సభలో ప్రశ్నించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా.. ఎంపీ మాట్లాడుతూ.. ముఖ్యంగా నీటి ఎద్దడి ఉన్న తెలంగాణ ప్రాంతంలో.. ప్రత్యేకంగా ఏమైనా కార్యక్రమాలు నిర్వహిస్తుందా..? అని లిఖిత పూర్వకంగా అడిగారు.

News December 10, 2024

ఖమ్మం: మాస్ కాపీయింగ్.. 22 మంది విద్యార్థులు డిబార్

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో సోమవారం జరిగిన డిగ్రీ పరీక్షలలో మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతూ 22 మంది విద్యార్థులు పట్టుబడినట్లు కేయూ పరీక్షల నియంత్రణ అధికారి కట్ల రాజేందర్ తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో 12 మంది, ఆదిలాబాద్‌లో ఐదుగురు, ఖమ్మంలో ఐదుగురు విద్యార్థులు చిట్టీలు రాస్తూ పట్టుబడగా వారిని డిబార్ చేసినట్లు చెప్పారు.