News January 4, 2025

ఖమ్మం: చింతకానిలో గుర్తు తెలియని మృతదేహం

image

ఖమ్మం జిల్లా చింతకాని నుంచి అనంతసాగర్ వెళ్లే మార్గ మధ్యలో ఉన్న మైసమ్మ గుడి సమీపంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. శుక్రవారం రాత్రి 7 గంటలకు వందేభారత్ రైలు కింద పడి ఆ వ్యక్తి మృతి చెందినట్టు స్థానికులు చెబుతున్నారు. వ్యక్తి నుజ్జు నుజ్జు కావడంతో గుర్తు పట్టడం కష్టంగా ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 20, 2025

ఖమ్మం: గంజాయి కేసు.. ఇద్దరికి 20 ఏళ్ల జైలు శిక్ష

image

గంజాయి కేసులో పట్టుబడిన ఇద్దరు నిందితులకు ఖమ్మం మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి కె. ఉమాదేవి బుధవారం సంచలన తీర్పు చెప్పారు. ఇద్దరికి 20 ఏళ్ల జైలు శిక్ష, ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున జరిమానా విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. తీర్పు అనంతరం ప్రాసిక్యూషన్‌కు సహకరించిన అధికారులను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ప్రత్యేకంగా అభినందించారు.

News November 20, 2025

ధాన్యం, పత్తి కొనుగోళ్లపై మంత్రి తుమ్మల సమీక్ష

image

ధాన్యం, పత్తి పంటల కొనుగోళ్లపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి సమీక్ష నిర్వహించారు. నాణ్యత పరిశీలించిన ధాన్యానికి రైస్ మిల్లుల వద్ద కోతలు విధించవద్దని అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలులో పాటిస్తున్న విధానాన్నే పత్తి కొనుగోలుకు కూడా పాటించాలన్నారు. గ్రామాల్లోనే తేమ శాతం చూడాలని సూచించారు.

News November 19, 2025

ఖమ్మం: యువ అభివృద్ధి పథకం.. దరఖాస్తుల ఆహ్వానం

image

జాతీయ యువ కౌమార అభివృద్ధి పథకం ద్వారా గ్రాంట్-ఇన్-ఎయిడ్(జీఐఏ) కోసం ప్రతిపాదనలను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన సర్వీసుల అధికారి సునీల్ రెడ్డి తెలిపారు. జిల్లాలోని నాన్-ప్రాఫిట్ ఆర్గనైజేషన్లు, నాన్- గవర్నమెంట్ ఆర్గనైజేషన్లు(NGO)ఈ పథకం కింద ఆర్థిక సాయం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జీఐఏ పోర్టల్ ద్వారా మాత్రమే అందిన దరఖాస్తులను స్వీకరిస్తామని పేర్కొన్నారు.