News October 20, 2024

ఖమ్మం: చిన్నారికి ఆపరేషన్ చేయించిన సోనూసూద్ 

image

సినీ నటుడు సోనూసూద్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. కల్లూరు మండలం చెన్నూరుకి చెందిన కంచెపోగు కృష్ణ, బిందుప్రియ దంపతుల 3 సంవత్సరాల చిన్నారికి గుండె సమస్యతో బాధపడుతోంది. రూ.6 లక్షల పైగా ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. నిరుపేద కుటుంబం కావడంతో తిరువూరు జ్ఞాన వేదిక వారు సోనూసూద్‌ దృష్టికి తీసుకెళ్లారు. ముంబైలో శనివారం ఆపరేషన్ చేయించారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యంగా నిలకడ ఉందని వైద్యులు చెప్పారు. 

Similar News

News March 9, 2026

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రికార్డు స్థాయిలో ‘మక్క’ సాగు

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ ఏడాది మొక్కజొన్న సాగు రికార్డు స్థాయికి చేరింది. రాష్ట్రంలోనే అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 1.69 లక్షల ఎకరాలు, భద్రాద్రి జిల్లాలో 72 వేల ఎకరాల్లో పంట సాగైంది. మార్కెట్‌లో క్వింటాల్ ధర రూ.1800 లోపే ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే రూ.2400 మద్దతు ధరతో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి, అకాల వర్షాల నుండి అన్నదాతలను ఆదుకోవాలని కోరుతున్నారు.

News March 9, 2026

కామేపల్లిలో రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి

image

కామేపల్లి క్రాస్ రోడ్డు సమీపంలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు మోటార్ సైకిళ్లు ఢీకొనడంతో ఊట్కూరుకి చెందిన దుగ్గి సాయి (22) అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో షేక్ అఖిల్ పాషాతో పాటు మరో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 8, 2026

ప్రతి కరెంట్ స్తంభానికి ‘యూనిక్’ నెంబర్: ఖమ్మం ఎస్‌ఈ

image

ఖమ్మం జిల్లాలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి జీఐఎస్ మ్యాపింగ్ వ్యవస్థను తీసుకొచ్చినట్లు ఎస్‌ఈ శ్రీనివాసాచారి తెలిపారు. 33 కేవీ లైన్లలో 55 ఫీడర్లు, 11 కేవీ లైన్లలో 545 ఫీడర్లకు యూనిక్ పోల్ నెంబర్లు కేటాయించారు. దీనివల్ల సమస్యలు వచ్చినప్పుడు పోల్ నెంబర్ ద్వారా లొకేషన్ గుర్తించి, యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయవచ్చని వివరించారు. ఈ టెక్నాలజీతో విద్యుత్ అంతరాయాలకు చెక్ పడనుంది.