News June 30, 2024
ఖమ్మం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు: తుమ్మల

హైదరాబాద్ తరహాలో ఖమ్మం అభివృద్ధి చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు రూ.655 కోట్లతో ఈ ఏడాది 6 రోడ్లు మంజూరు చేశామన్నారు. ఖమ్మం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తామని చెప్పారు. గతంలో R&B మంత్రిగా ఉన్నప్పుడు ఈ రహదారుల గురించి ప్రతిపాదన చేశానన్నారు. కొత్తగూడెం పాల్వంచ బైపాస్, మిస్సింగ్ లింక్ కలపడానికి 6km రోడ్డు రూ.125 కోట్లకు ఆమోదముద్ర పడిందన్నారు.
Similar News
News November 24, 2025
రేపు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు: భట్టి

రేపు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన సీఎస్ కే.రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ అంశంపై జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. చీరల పంపిణీ, స్కాలర్‌షిప్‌లు, పీఎంఏవై అంశాలపై చర్చించారు.
News November 24, 2025
KMM: సదరం సర్టిఫికెట్ ఉన్నా పెన్షన్ రాక ఆందోళన

ఖమ్మం జిల్లాలో సదరం సర్టిఫికెట్లు పొందిన వికలాంగులు రెండేళ్లుగా పెన్షన్లు మంజూరు కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెన్షన్లు మంజూరు కాకపోగా, తీసుకున్న సర్టిఫికెట్ల గడువు ముగిసిపోతుండటంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, అర్హులైన వికలాంగులకు పెండింగ్‌లో ఉన్న పెన్షన్లను వెంటనే మంజూరు చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
News November 24, 2025
ఖమ్మం: త్వరలో ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు

అర్హులైన రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ పథకం కింద పెట్టుబడి సాయం త్వరలో జమ చేయనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. భూమి ఉన్న రైతులతో పాటు, భూమి లేని వ్యవసాయ కార్మికులకూ ఎకరానికి సంవత్సరానికి రూ.12,000 చొప్పున ఈ సాయం అందిస్తామని ఆయన పేర్కొన్నారు. త్వరలో డబ్బులు జమ అవుతాయని మంత్రి భరోసా ఇచ్చారు.


