News January 26, 2025
ఖమ్మం జలవనరుల శాఖ సీఈగా రమేష్ బాబు

సూర్యాపేట సీఈ(చీప్ ఇంజనీర్)గా విధులు నిర్వహిస్తున్న రమేష్ బాబుకు ఖమ్మం జలవనరులశాఖ సీఈగా అదనపు బాధ్యలు ఇస్తూ శనివారం జలవనరుల శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 31న ఖమ్మం సీఈగా ఉన్న విద్యాసాగర్ పదవీ విరమణ పొందారు. అప్పటి నుంచి ఖమ్మం సీఈగా ఎవరిని నియమించలేదు. ఈ నేపథ్యంలో రమేష్ బాబుకు అదనపు బాధ్యతలు అప్పగించారు.
Similar News
News November 24, 2025
ఖమ్మం నుంచి సూర్యలంక బీచ్‌కు ఆర్టీసీ డీలక్స్ బస్సు

ఖమ్మం కొత్త బస్టాండ్ నుంచి బాపట్లలోని సూర్యలంక బీచ్‌కు డీలక్స్ బస్సు సర్వీసును అందుబాటులోకి తెచ్చినట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ శివప్రసాద్ తెలిపారు. ఈ నెల 30న (ఆదివారం) ఉ.6.00 గంటలకు ఈ సర్వీసు నడుస్తుందన్నారు. టికెట్ ధర పెద్దలకు ₹1,000, పిల్లలకు ₹530గా నిర్ణయించారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

News November 23, 2025
ఖమ్మం: నాటక రంగాన్ని బతికించడంలో నెల నెల వెన్నెలది గొప్ప పాత్ర

‘నెల నెల వెన్నెల’ వందో నెల వేడుకకు కలెక్టర్ అనుదీప్ హాజరయ్యారు. మొబైల్స్‌కు అలవాటు పడిన ప్రేక్షకులను నాటకరంగం వైపు ఆకర్షిస్తున్న ‘నెల నెల వెన్నెల’ కృషిని ఆయన కొనియాడారు. భక్త రామదాసు కళాక్షేత్రాన్ని రవీంద్ర భారతి తరహాలో అభివృద్ధి చేస్తామని కలెక్టర్ హమీ ఇచ్చారు. కార్యక్రమంలో ‘చీకటి పువ్వు’ నాటిక ప్రదర్శన జరిగింది.