News January 26, 2025
ఖమ్మం జలవనరుల శాఖ సీఈగా రమేష్ బాబు

సూర్యాపేట సీఈ(చీప్ ఇంజనీర్)గా విధులు నిర్వహిస్తున్న రమేష్ బాబుకు ఖమ్మం జలవనరులశాఖ సీఈగా అదనపు బాధ్యలు ఇస్తూ శనివారం జలవనరుల శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 31న ఖమ్మం సీఈగా ఉన్న విద్యాసాగర్ పదవీ విరమణ పొందారు. అప్పటి నుంచి ఖమ్మం సీఈగా ఎవరిని నియమించలేదు. ఈ నేపథ్యంలో రమేష్ బాబుకు అదనపు బాధ్యతలు అప్పగించారు.
Similar News
News February 12, 2025
ఖమ్మం: చెక్‌పోస్టులతో కోళ్ల దిగుమతికి కట్టడి

ఏపీలోని పలు ప్రాంతాల్లో కోళ్లకు హైలీ పాతోజెనిక్ అవెన్ ఫ్లూయాంజా వైరస్ సోకిందని నిర్ధారణ అయ్యింది. అయితే సరిహద్దుగా ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లా కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, అశ్వారావుపేట తదితర మండల్లాలోని పౌల్ట్రీఫామ్‌ల్లోనూ కోళ్లు మృతిచెందగా దీనికి వైరసే కారణమని నిర్ధారణ కాలేదు. కానీ ఏపీ నుంచి కోడిపిల్లలు, కోళ్లు, దాణా దిగుమతి అవుతుండడంతో చెక్‌పోస్టుల ద్వారా అధికారులు వాటిని కట్టడి చేస్తున్నారు.
News February 12, 2025
ప్రకాష్ నగర్ మున్నేరు వంతెనపై రాకపోకలు పునరుద్ధరణ

ఖమ్మం ప్రకాష్ నగర్ మున్నేరు వంతెనపై రాకపోకలను పునరుద్ధరించారు. గత సెప్టెంబర్ నెలలో వరదలకు దెబ్బతిన్న వంతెన మరమ్మతులు పూర్తి చేసి, మంగళవారం సాయంత్రం నుంచి వాహన రాకపోకలను అనుమతించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించి మాట్లాడుతూ.. వరదల సమయంలో ప్రకాష్ నగర్ వంతెన 9 పిల్లర్లు దెబ్బతిన్నాయని చెప్పారు. అధికార యంత్రాంగం ఆధునిక టెక్నాలజీ వినియోగించి పనులు పూర్తి చేసిందన్నారు.
News February 12, 2025
ఖమ్మం: రూ.91 లక్షలకు వ్యాపారి దివాలా పిటిషన్

ఖమ్మం పట్టణం శ్రీనివాస నగర్ కు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి రూ.91,04,593 లకు దివాళా పిటిషన్ దాఖలు చేశాడు. ఫిర్యాదుదారుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు. ఈ వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి అధిక వడ్డీలకు పలువురి వద్ద అప్పు చేశారు. వ్యాపారంలో తీవ్రంగా నష్టం రావడంతో అప్పు తీర్చే మార్గం లేకపోవడంతో పదిమంది రుణదాతలను ప్రతివాదులుగా చేరుస్తూ దివాలా పిటిషన్ మంగళవారం స్థానిక కోర్టులో దాఖలు చేశాడు.