News April 18, 2025
ఖమ్మం జిల్లాకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

ఖమ్మం జిల్లాకు ఖమ్మం అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా. ఖమ్మం నగర మధ్యలో ఉన్న స్తంభాద్రి నుంచి మండపాలకు, స్తంభాలకు కావాల్సిన రాళ్లు తరలించేవారని చరిత్ర చెబుతుంది. ఉర్దూ భాషలో ఖమ్మం అంటే స్తంభం అని అర్ధం. అలాగే నరసింహస్వామి పేరు మీద ఈ పేరు వచ్చిందనే వాదన ఉంది. బ్రిటిష్ వారి పాలనలో ఈ ప్రాంతాన్ని ‘ఖమ్మం మెట్టు’ అని పిలిచేవారనే మరో వాదన ఉంది. దీంతో ఖమ్మంకు అలా పేరు వచ్చిందని చెబుతున్నారు.
Similar News
News December 19, 2025
ఖమ్మం జిల్లాలో 172మంది లష్కర్ల నియామకం

ఖమ్మం జిల్లా జలవనరుల శాఖలో సాగునీటి పంపిణీ పర్యవేక్షణ కోసం ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన 172మంది లష్కర్లను నియమించారు. మూడు ఏజెన్సీల ద్వారా చేపట్టిన ఈ నియామక ప్రక్రియలో ఎంపికైన వారికి నెలకు రూ. 15వేల వేతనం చెల్లించనున్నారు. ఈ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, ఎమ్మెల్యేల సిఫారసులకు పెద్దపీట వేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నియామకాల్లో అర్హులకు అన్యాయం జరిగిందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి.
News December 19, 2025
ఖమ్మం: ప్రశాంతంగా ముగిసిన పల్లె సమరం: కలెక్టర్ అనుదీప్

ఖమ్మం జిల్లాలో మూడు విడతల పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా ముగిశాయని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రకటించారు. మొత్తం 566 సర్పంచ్, ఉపసర్పంచ్ స్థానాలతో పాటు, 5,168 వార్డులకు ఎన్నికలు నిర్వహించినట్లు తెలిపారు. విధుల్లో చిత్తశుద్ధితో పనిచేసిన సిబ్బందిని ఆయన అభినందించారు. పోలింగ్ ప్రశాంతంగా జరగడానికి సహకరించిన ప్రజలకు, రాజకీయ పార్టీలకు కలెక్టర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
News December 19, 2025
ఖమ్మం: మహిళా డెయిరీ ద్వారా 20 వేల మందికి లబ్ధి

ఖమ్మం జిల్లాలో ఇందిరా మహిళా డెయిరీ ద్వారా మూడేళ్లలో 20 వేల మందికి లబ్ధి చేకూర్చాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. గురువారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. మహిళల ఆర్థికాభివృద్ధికి నాణ్యమైన పాడి పశువులను అందించాలన్నారు. పాల ఉత్పత్తి పెంచేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్, అదనపు కలెక్టర్ శ్రీజ పాల్గొన్నారు.


