News February 2, 2025
ఖమ్మం జిల్లాకు నేడు మంత్రి పొంగులేటి రాక

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నట్లు మంత్రి క్యాంపు కార్యాలయం ఇన్‌ఛార్జి ఒక ప్రకటనలో తెలిపారు. పర్యటనలో భాగంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నేలకొండపల్లి, ఖమ్మం, అశ్వారావుపేట, వైరా మండలాల్లో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని అధికారులు, కాంగ్రెస్ శ్రేణులు గమనించి సకాలంలో హాజరుకావాలని సూచించారు.
Similar News
News February 15, 2025
ఖమ్మం: స్టేడియంలో అన్ని సౌకర్యాలు కల్పించాలి: కలెక్టర్

ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. అదనపు కలెక్టర్ శ్రీజతో కలిసి స్టేడియంను సందర్శించారు. స్విమ్మింగ్ పూల్, షటిల్ బ్యాట్ స్కేటింగ్, వ్యాయామ కేందం, జిమ్నాస్టిక్ హాల్, వాలీబాల్ కోర్టును పరిశీలించారు. క్రీడాకారులకు పౌష్టికాహారం, ఫ్రూట్స్, స్పోర్ట్ షూ అవసరమైన క్రీడా సామగ్రిని అందించాలని కోరారు.
News February 15, 2025
KMM: ఎక్కడ చూసినా అదే చర్చ..!

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా WGL-KMM-NLG టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల హీట్ నడుస్తోంది. టీచర్ MLC ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, పులి సరోత్తంరెడ్డి, శ్రీపాల్ రెడ్డి పింగిళి, పూల రవీందర్ తదితర నేతల మధ్యపోటీ ఉంటుందని చర్చలు జరుగుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు మార్నింగ్ వాక్, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు.
News February 15, 2025
ఖమ్మం జిల్లాలో రూ.598 కోట్ల పెండింగ్ కరెంట్ బిల్లులు

ఖమ్మం జిల్లాలో విద్యుత్తు బిల్లులు పేరుకుపోయాయి. విద్యుత్తుశాఖలో భారీ స్థాయిలో బకాయిలు పేరుకుపోయాయి. ప్రైవేట్, ప్రభుత్వశాఖల నుంచి మొత్తం రూ.598 కోట్ల బకాయిలున్నాయి. ఇంత మొత్తం బకాయిలు ఉండటంతో ఆ శాఖపై పెనుభారం పడుతోంది. సంబంధిత శాఖ బకాయిలను రికవరీ చేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అయితే ఈ బకాయిల్లో సింహభాగం రూ.241 కోట్లు మిషన్ భగీరథవి ఉండటం గమనార్హం.