News April 3, 2025

ఖమ్మం జిల్లాకు వర్ష సూచన

image

ఖమ్మం జిల్లాలోని ఈ నెల 5వరకు పలు చోట్ల ఈదురు గాలులతో పాటు తేలికపాటి వర్షం కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీంతో ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గే అవకాశముందని వెల్లడించింది. దీంతో జిల్లాలో నమోదయ్యే 40-41 డిగ్రీల ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పడతాయని భావిస్తున్నారు. దీంతో పంటలు నాశనమవుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.

Similar News

News April 11, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యంశాలు.!

image

☆ సెక్టర్ ఆఫీసర్లు బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలి: ఖమ్మం సీపీ ☆ జిల్లాలో 25 కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం: అ.కలెక్టర్ ☆ KMM: వాకింగ్ వెళ్తుండగా ప్రమాదం.. వృద్ధుడి మృతి ☆ జిల్లా వ్యాప్తంగా ఘనంగా ఫులే జయంతి ☆ రైస్ మిల్లర్లకు ముదిగొండ తహశీల్దార్ వార్నింగ్ ☆ ఖమ్మం: 20 మందికి రూ.10.7 లక్షల చెక్కులు పంపిణీ ☆ NKP: రైతుల కన్నీటి పర్యంతం (VIDEO) ☆ KMM: 5రోజుల పోరాటం.. అయినా దక్కని ప్రాణం.

News April 11, 2025

KMM: 5రోజుల పోరాటం.. అయినా దక్కని ప్రాణం

image

ఖమ్మం జిల్లా పెనుబల్లిలో 5 రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన 9వ తరగతి విద్యార్థి వంశీ హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. మండలంలో చౌడవరంనకు చెందిన వంశీ ఒంటిపూట బడులు కావడంతో ఆరోజు ప్రభుత్వ పాఠశాల నుంచి సైకిల్‌పై ఇంటికెళ్తుండగా లారీఢీకొంది. ఈ ప్రమాదంలో కుడికాలు నుజ్జునుజ్జవగా హైదరాబాద్ తరలించగా వంశీ మృతిచెందాడు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News April 11, 2025

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు మూడు రోజులు సెలవు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. రేపు శనివారం, ఆదివారం వారాంతపు సెలవు, సోమవారం అంబేడ్కర్ జయంతి సందర్భంగా సెలవును ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. జిల్లా రైతులు గమనించి మార్కెట్ సిబ్బందికి సహకరించాలని కోరారు. మార్కెట్ తిరిగి మంగళవారం ప్రారంభం అవుతుందని చెప్పారు. 

error: Content is protected !!