News February 28, 2025
ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్యంశాలు

> ఖమ్మం:ఉద్యోగ విరమణ పొందిన పోలీసులకు సీపీ సన్మానం> సత్తుపల్లి: కార్యకర్తలపై ఎమ్మెల్యే అసహనం> ఖమ్మం: రూ.3 లక్షల మిర్చి పంట చోరీ> బోనకల్: 2 కార్లు డీ.. ఇద్దరికి గాయాలు> ముదిగొండ: బిల్డింగ్ పై నుంచి పడి కార్మికుడి మృతి> తిరుమలాయపాలెం:యువతిని మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు >సత్తుపల్లి: మంత్రి తుమ్మల అనుచరుడు గాదె సత్యం మృతి
Similar News
News March 21, 2025
ఉగాది నుంచి సన్నబియ్యం: మంత్రి పొంగులేటి

ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఈరోజు పెనుబల్లి మండలంలో ఇందిరమ్మ ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని మంత్రి మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు తమ ప్రభుత్వం యత్నిస్తుందని వెల్లడించారు. ప్రజా పాలనలో అందరికీ మేలు జరుగుతుందని వివరించారు.
News March 21, 2025
ధాన్యం కొనుగోలుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు: జిల్లా కలెక్టర్

రబీ సీజన్లో ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనుగోలుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో 2024-25 రబీ ధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ప్రస్తుత అంచనా ప్రకారం రబీ సీజన్ కు సంబంధించి 1,85,000 మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యం, 73,000 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం ధాన్యం, మొత్తం 2,58,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయబోతున్నామన్నారు.
News March 21, 2025
అవసరం లేనిది వదిలేయండి: జిల్లా కలెక్టర్

KMM: మన ఇంట్లో మనకు అవసరం లేని వస్తువులు ఇతరులకు ఉపయోగ పడవచ్చని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్, జిల్లా ప్రధాన ఆసుపత్రి ఎదురుగా వాల్ ఆఫ్ కైండ్ నెస్ గోడను అ.కలెక్టర్ శ్రీజ, ట్రైన్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట, DFO సిద్దార్థ్ విక్రమ్ సింగ్‌లతో కలిసి ప్రారంభించారు. ప్రజలు తమ ఇంట్లో అవసరం లేని వస్తువులు, పాత సామాన్లు, బట్టలు వదిలితే అవి అవసరం ఉన్నవారుతీసుకొని వెళ్తారన్నారు.