News March 2, 2025

ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్య అంశాలు

image

✓: ఖమ్మం: ‘రాణా పైనుంచి దూకి వ్యక్తి ఆత్మహత్యా యత్నం’✓: 8న లోక్ అదాలత్: కారేపల్లి ఎస్ఐ✓: నేలకొండపల్లి:పొంగులేటి చొరవతో షాదీఖానాకు రూ.50లక్షలు✓:ఖమ్మం: ‘ఆలయం ఎదుట అశ్లీల నృత్యాలు’✓ ఖానాపురం:తప్పుడు పత్రాల రిజిస్ట్రేషన్ల ముఠాపై కేసు నమోదు✓చింతకాని: కారులోనే లింగ నిర్ధారణ పరీక్షలు.. ఇద్దరు అరెస్ట్✓:ఖమ్మం: 20లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు: మంత్రి తుమ్మల

Similar News

News March 21, 2025

ఉగాది నుంచి సన్నబియ్యం: మంత్రి పొంగులేటి

image

ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఈరోజు పెనుబల్లి మండలంలో ఇందిరమ్మ ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని మంత్రి మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు తమ ప్రభుత్వం యత్నిస్తుందని వెల్లడించారు. ప్రజా పాలనలో అందరికీ మేలు జరుగుతుందని వివరించారు.

News March 21, 2025

ధాన్యం కొనుగోలుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు: జిల్లా కలెక్టర్

image

రబీ సీజన్లో ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనుగోలుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో 2024-25 రబీ ధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ప్రస్తుత అంచనా ప్రకారం రబీ సీజన్ కు సంబంధించి 1,85,000 మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యం, 73,000 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం ధాన్యం, మొత్తం 2,58,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయబోతున్నామన్నారు.

News March 21, 2025

అవసరం లేనిది వదిలేయండి: జిల్లా కలెక్టర్

image

KMM: మన ఇంట్లో మనకు అవసరం లేని వస్తువులు ఇతరులకు ఉపయోగ పడవచ్చని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్, జిల్లా ప్రధాన ఆసుపత్రి ఎదురుగా వాల్ ఆఫ్ కైండ్ నెస్ గోడను అ.కలెక్టర్ శ్రీజ, ట్రైన్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట, DFO సిద్దార్థ్ విక్రమ్ సింగ్‌లతో కలిసి ప్రారంభించారు. ప్రజలు తమ ఇంట్లో అవసరం లేని వస్తువులు, పాత సామాన్లు, బట్టలు వదిలితే అవి అవసరం ఉన్నవారుతీసుకొని వెళ్తారన్నారు.

error: Content is protected !!