News March 5, 2025
ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్యాంశాలు

✓ ఏన్కూర్: టాటా ఏసీ వాహనంలో ACలు, కూలర్లు దగ్ధం ✓ ఖమ్మం: ప్రైవేటు కళాశాల విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ ✓ ఫారెస్ట్, ఎండోమెంట్ అధికారులతో Dy.CM సమీక్ష ✓ అశ్వారావుపేట పోలీసుల దురుసు: MRPS ✓ ఖమ్మం: హీటర్ ఆన్ చేస్తుండగా షాక్ తో వ్యక్తి మృతి ✓ ఖమ్మం: బియ్యం వ్యాపారి రూ.2 కోట్లకు ఐపీ దాఖలు ✓ మధిరలో ఎమ్మెల్సీ విజయోత్సవ సంబురాలు ✓ ఖమ్మం: ఆధారాలు లేకుండా మాట్లాడితే సహించం: పగడాల.
Similar News
News November 12, 2025
ఖమ్మం: దివ్యాంగుల పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానం

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగుల సాధికారిత రాష్ట్ర పురస్కారాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా దివ్యాంగుల సంక్షేమశాఖ అధికారి రాంగోపాల్రెడ్డి తెలిపారు. అర్హులైన వ్యక్తులు, సంస్థలు ఆన్లైన్లో ఉన్న దరఖాస్తు ఫారాలు, మార్గదర్శకాలను ఉపయోగించుకోవాలని కోరారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 20వ తేదీలోపు కార్యాలయంలో సమర్పించాలి.
News November 12, 2025
ఖమ్మం: బోనస్పై అనుమానం.. కొనుగోళ్లలో జాప్యం

ఖమ్మం జిల్లాలో వానాకాలం ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. గతంలో విక్రయించిన ధాన్యానికి బోనస్ ఇంకా జమ కాకపోవడంతో రైతుల్లో గందరగోళం నెలకొంది. మద్దతు ధరతో పాటు బోనస్ రావాలంటే కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మాల్సి ఉన్నా, బోనస్పై అనుమానంతో రైతులు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకోవడానికి మొగ్గు చూపుతున్నారు.
News November 12, 2025
ఖమ్మం జిల్లాలో 10 నెలల్లో రూ. 14 కోట్లు దోపిడీ

ఖమ్మం జిల్లాలో సైబర్ మోసాలు హడలెత్తిస్తున్నాయి. గత 10 నెలల్లోనే వివిధ పోలీస్ స్టేషన్లలో 330కి పైగా కేసులు నమోదయ్యాయి. సైబర్ నేరగాళ్లు జిల్లా వాసుల నుంచి ఏకంగా రూ. 14 కోట్లు దోచుకున్నారు. నష్టపోయిన 24 గంటల్లో ఫిర్యాదు చేయడంతో రూ. 4 కోట్లు రికవరీ అయింది. కొరియర్ వచ్చిందంటూ ఓటీపీ చెప్పించడం ద్వారానే ఎక్కువ మోసాలు జరిగాయి.


