News April 8, 2025
ఖమ్మం జిల్లాలో ఉదయం ఎండ, సాయంత్రం వాన

ఖమ్మం జిల్లాలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. మధ్యాహ్నం వరకు ఎండలు దంచి కొడుతుండటంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సాయంత్రం ఉన్నట్టుండి వాతావరణం చల్లబడి ఈదురుగాలలో కూడిన వర్షం కురుస్తోంది. సోమవారం జిల్లాలో వడగండ్ల వర్షం కురవడంతో మామిడి కాయలు నేలరాలాయి. మొక్కజొన్న పంట నేలకొరిగింది. నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు అప్రమత్తమయ్యారు.
Similar News
News November 30, 2025
ఖమ్మం: పెళ్లి పనుల్లో విషాదం.. కరెంట్ షాక్తో యువకుడి మృతి

సింగరేణి మండలం బొక్కల తండా గ్రామానికి చెందిన అజ్మీర విజయ్(24) శనివారం సాయంత్రం విద్యుత్ షాక్తో మృతి చెందాడు. తిరుమలాయపాలెంలో పెళ్లి డెకరేషన్ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు ఐరన్ పైపుకు 33/11 కేవీ విద్యుత్ తీగలకు తగలడంతో ఈ ఘటన జరిగింది. విజయ్ అకాల మరణంతో అతడి కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News November 30, 2025
ఖమ్మంలో రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం

ఖమ్మం జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ నేటి నుంచి ప్రారంభమైంది. ఈ విడతలో ఆరు మండలాల పరిధిలోని 183 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయి. మొత్తం 1686 వార్డులకు నామినేషన్లు స్వీకరించనున్నారు. కామేపల్లి, ఖమ్మం రూరల్, కుసుమంచి, ముదిగొండ, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం మండలాల్లోని అభ్యర్థులు నేటి నుంచి నామినేషన్లు దాఖలు చేయవచ్చు. ఎన్నికల యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
News November 30, 2025
ప్లాస్టిక్ వాడితే జరిమానాలు తప్పవు: కమిషనర్

ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు కమీషనర్ అభిషేక్ అగస్త్య కఠిన చర్యలు ప్రారంభించారు. రాబోయే 15 రోజులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి షాప్కు ఒక కిలో బయోడీగ్రేడబుల్ కవర్లను ఉచితంగా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ గడువు తర్వాత ప్లాస్టిక్ వాడే సంస్థలపై జరిమానాలు విధిస్తామన్నారు. పర్యావరణహిత క్లాత్ లేదా జూట్ బ్యాగులు వాడాలని విజ్ఞప్తి చేశారు.


