News March 16, 2025

ఖమ్మం జిల్లాలో చికెన్ ధరలు ఇలా..

image

ఖమ్మం జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. చికెన్ (విత్ స్కిన్) KG రూ. 160 ఉండగా, స్కిన్లెస్ కేజీ రూ. 180 ధర పలుకుతుంది. అలాగే లైవ్ కోడి రూ. 110 మధ్య ఉంది. కాగా బడ్ ఫ్లూ ఎఫెక్ట్ తో గత నెల క్రితం భారీగా అమ్మకాలు పడిపోగా.. ప్రస్తుతం అమ్మకాలు పెరగాయని, ధర సైతం పెరిగిందని నిర్వాహకులు తెలుపుతున్నారు.

Similar News

News March 18, 2025

ఖమ్మంలో దూసుకెళ్తున్న LRS ఆదాయం

image

ఎల్ఆర్‌ఎస్‌పై ప్రభుత్వం రాయితీ ప్రకటించింది. దీంతో ఖమ్మంలో LRS ఆదాయం దూసుకెళ్తుంది. రోజుకు 70 నుంచి 80 దరఖాస్తులకు చెల్లింపులు జరుగుతున్నాయి. దీంతో ఇప్పటికే ఖమ్మం మున్సిపాలిటీ పరిధిలో 1,895 దరఖాస్తులకు చెల్లింపులు జరగగా.. రూ. 10.61 కోట్ల ఆదాయం వచ్చింది. ఇది మరింత పెరిగే అవకాశం ఉంది

News March 18, 2025

రైళ్లు ఆలస్యం.. ప్రయాణికులు పడిగాపులు..!

image

ఖమ్మం మీదుగా వెళ్లే రైళ్లు ఆలస్యంగా నడవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. 83 రైళ్లకు ఖమ్మంలో హాల్టింగ్‌ ఉంది. రైళ్లు రద్దయినప్పుడు కాకుండా మిగతా రోజుల్లో అన్ని రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా నడుస్తుండడంతో ప్రయాణికులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. మూడోలైన్‌ నిర్మాణ పనుల కారణంగా రైళ్లు నెమ్మదిగా నడుస్తున్నాయని.. పనులు పూర్తయితే అన్ని రైళ్లు సమయానికి నడుస్తాయని అధికారులు వెల్లడించారు.

News March 18, 2025

ఖమ్మం: ఇంటి వద్దకే రాములవారి తలంబ్రాలు: ఆర్ఎం

image

ఆర్టీసీ కార్గో ద్వారా సీతారాముల కళ్యాణ తలంబ్రాలను ఇంటి వద్దకే పంపించే ఏర్పాటు చేసినట్లు ఖమ్మం RM సరిరామ్ తెలిపారు. దీనికోసం ఆన్లైన్ లేదా బస్టాండ్ సెంటర్లు మరియు ఏజెంట్ కౌంటర్ లో రూ.151 చెల్లించి బుక్ చేసుకోవచ్చున్నారు. మరిన్ని వివరాలకు ఖమ్మం :9154298583, మధిర :9154298584, సత్తుపల్లి:9154298585, భద్రాచలం:9154298586 కొత్తగూడెం&ఇల్లందు:9154298585, మణుగూరు: 9154298588 నంబర్లకు సంప్రదించాలన్నారు.

error: Content is protected !!