News April 10, 2025
ఖమ్మం జిల్లాలో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు

ఖమ్మంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. బుధవారం ఎర్రుపాలెంలో అత్యధికంగా 40.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అటు ముదిగొండలో 40.8, నేలకొండపల్లిలో 40.5, ఖమ్మం(U) ఖానాపురం PS, ఖమ్మం(R) పల్లెగూడెంలో 40, లింగాల (కామేపల్లి), కారేపల్లిలో 39.2, సత్తుపల్లిలో 39, మధిరలో 38.6, మంచుకొండ (రఘునాథపాలెం) 38.5, తల్లాడలో 38.5, కల్లూరులో 37.5, గౌరారం ( పెనుబల్లి) 37.1 నమోదైంది.
Similar News
News October 28, 2025
నేర నియంత్రణలో సాంకేతికత కీలకం: ఖమ్మం సీపీ

ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆధ్వర్యంలో సిటీ ఆర్ముడ్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఆన్లైన్ “ఓపెన్ హౌస్” మంగళవారం నిర్వహించారు. పోలీసులు వినియోగించే ఆధునిక సాంకేతిక పద్ధతులు, ఫింగర్‌ప్రింట్ యూనిట్, బాంబ్ డిస్పోజల్, సైబర్ నేరాలను పసిగట్టే విధానాలు విద్యార్థులకు చూపించారు. డాగ్ స్క్వాడ్ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. సీపీ మాట్లాడుతూ.. సాంకేతికతతోనే నేర నియంత్రణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
News October 28, 2025
తుఫాన్లలోనూ ఆగని విద్యుత్.. భూగర్భ కేబుల్ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన

మధిర పట్టణంలో విద్యుత్ రంగాన్ని ఆధునీకరించేందుకు రూ.27.76 కోట్ల వ్యయంతో చేపట్టనున్న భూగర్భ విద్యుత్ కేబుల్ నిర్మాణ పనులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంగళవారం శంకుస్థాపన చేశారు. భారీ వర్షాలు, తుఫాన్ల సమయంలో కూడా విద్యుత్ అంతరాయం లేకుండా సరఫరా చేయడమే లక్ష్యమన్నారు. మొత్తం 3.5 కి.మీ 33 కేవీ, 17.3 కి.మీ 11 కేవీ, 15 కి.మీ ఎల్టీ లైన్లను భూగర్భంలో వేయనున్నట్లు తెలిపారు.
News October 28, 2025
రాయపట్నంలో సబ్‌స్టేషన్‌కు Dy.CM భట్టి శంకుస్థాపన

మధిర మండలం రాయపట్నం గ్రామంలో 33/11 కేవీ నూతన విద్యుత్ ఉపకేంద్ర నిర్మాణానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా, వోల్టేజీ సమస్యల పరిష్కారం, పరిశ్రమలకు నిరంతర విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి సేవలు అందించడానికి ఈ ఉపకేంద్రం దోహదపడుతుందని తెలిపారు.


