News January 31, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటన ∆} పలు శాఖల అధికారులతో కలెక్టర్ ముజమ్మల్ ఖాన్ సమీక్ష సమావేశం ∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన ∆} ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

Similar News

News February 9, 2025

ఖమ్మం: స్థానిక సమరానికి రె‘ఢీ’

image

ఖమ్మం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. తాజాగా పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు అధికార యంత్రాంగం సమాయాత్తమవుతోంది. ఇటీవలే మండల కేంద్రాల్లో జాబితాను రూపొందించి, ప్రదర్శించారు. జిల్లాలో 8,52,879 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. ఇప్పటికే కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, సీపీ సునీల్ దత్ ముందస్తు పకడ్బందీ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

News February 9, 2025

అమెరికాలో ఖమ్మం జిల్లా యువకుడి సూసైడ్

image

అమెరికా న్యూయార్క్‌లో ఖమ్మం జిల్లా యువకుడు తుమ్మేటి సాయి కుమార్ రెడ్డి సూసైడ్ చేసుకున్నారు. చదువుకుంటూ, పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్న సాయి కుమార్ ఆఫీసులోనే పాస్ పోర్టు వదిలేసినట్లు సమాచారం. అకాల మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అతడి మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

News February 9, 2025

నిర్మలా సీతారామన్‌ను కలిసిన Dy.CM భట్టి

image

దేశ రాజధాని దిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి వివిధ అంశాల్లో రావలసిన ఆర్థిక వనరులకు సంబంధించి విజ్ఞప్తి చేశారు. గతంలో ఈ అంశాలకు సంబంధించి రాసిన లేఖలను నిర్మలా సీతారామన్‌కు అందజేశారు. ఆయన వెంట ఎంపీలు మల్లు రవి, పోరిక బలరాం నాయక్, చామల కిరణ్ కుమార్ రెడ్డి తదితరులున్నారు.

error: Content is protected !!