News April 16, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!!

image

∆} వివిధ శాఖల అధికారులతో ఇన్‌ఛార్జి కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన ∆} వైరా అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} నేలకొండపల్లిలో సీఎం రిలీఫ్ అండ్ చెక్కులు పంపిణీ ∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} వైరాలో ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ పర్యటన

Similar News

News November 12, 2025

87% బిల్లులు డిజిటల్‌తోనే: ఖమ్మం ఎస్ఈ

image

TGNPDCL డిజిటల్ చెల్లింపుల విధానాన్ని అందుబాటులోకి తేవడంతో, వినియోగదారులు ఆన్‌లైన్‌లో బిల్లులు చెల్లించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం 87% మంది టీజీఎన్‌పీడీసీఎల్ యాప్, గూగుల్ పే వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారానే బిల్లులు చెల్లిస్తున్నారని ఖమ్మం ఎస్ఈ శ్రీనివాస చారి తెలిపారు. తద్వారా కౌంటర్లకు వెళ్లే శ్రమ లేకుండా, సురక్షితంగా బిల్లులు చెల్లించవచ్చని ఆయన పేర్కొన్నారు.

News November 12, 2025

వెలుగుమట్లలో సైనిక్ స్కూల్ అర్హతల పరిశీలన

image

ఖమ్మం జిల్లాలో సైనిక్ స్కూల్ ఏర్పాటు అర్హత పరిశీలనలో భాగంగా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి బుధవారం వెలుగుమట్లలోని శ్రీ చైతన్య విస్టా పాఠశాలను పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం పిపిపి మోడ్‌లో దేశవ్యాప్తంగా 100 సైనిక్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని కలెక్టర్ తెలిపారు. ఖమ్మంలో దరఖాస్తు చేసిన ఈ పాఠశాల అర్హతను కమిటీ పరిశీలన ఆధారంగా నిర్ణయిస్తుందని అన్నారు.

News November 12, 2025

ఖమ్మం: దివ్యాంగుల పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానం

image

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగుల సాధికారిత రాష్ట్ర పురస్కారాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా దివ్యాంగుల సంక్షేమశాఖ అధికారి రాంగోపాల్రెడ్డి తెలిపారు. అర్హులైన వ్యక్తులు, సంస్థలు ఆన్‌లైన్‌లో ఉన్న దరఖాస్తు ఫారాలు, మార్గదర్శకాలను ఉపయోగించుకోవాలని కోరారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 20వ తేదీలోపు కార్యాలయంలో సమర్పించాలి.