News January 31, 2025
ఖమ్మం జిల్లాలో నేడు మంత్రి పొంగులేటి పర్యటన

రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారని మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్ఛార్జి దయాకర్ రెడ్డి ప్రకటనలో తెలిపారు. మంత్రి పర్యటనలో భాగంగా తిరుమలాయపాలెం, కూసుమంచి, ఖమ్మం రూరల్, ఖమ్మం అర్బన్ మండలాల్లోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తారని చెప్పారు. కావున మీడియా మిత్రులు, కాంగ్రెస్ అభిమానులు, ప్రజలు గమనించాలని కోరారు.
Similar News
News November 16, 2025
ఖమ్మం: లోక్ అదాలత్లో 4,635 కేసులు పరిష్కారం

కేసుల రాజీతో కక్షిదారుల సమయం, డబ్బు ఆదా అవుతుందని ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయాధికారి జి. రాజగోపాల్ తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు శనివారం ప్రత్యేక లోక్ అదాలత్ను నిర్వహించారు. మొత్తం 4,635 కేసులను పరిష్కరించారు. వీటిలో క్రిమినల్ కేసులు 596, ఈ పెట్టి కేసులు 2, 350, చెక్ బౌన్స్ 53, ఇతర కేసులు 1,636 ఉన్నాయి. పరిష్కారం చేసుకున్న కక్షిదారులకు పూల మొక్కలు, అవార్డులు బహూకరించారు.
News November 16, 2025
నేటి నుంచి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ తరగతులు

డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఖమ్మం అధ్యయన కేంద్రంలో నేటి నుంచి వివిధ కోర్సుల తరగతులు ప్రారంభమవుతాయని కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ మొహమ్మద్ జాకీరుల్లా తెలిపారు. నేటి నుంచి మార్చి 1 వరకు పీజీ ద్వితీయ సంవత్సర తరగతులు జరుగుతాయని, యూజీ సెమిస్టర్ 1, 3, 5 తరగతులు కూడా ప్రారంభమవుతాయని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ కోరారు.
News November 16, 2025
ఖమ్మం జిల్లాలో 3.5 కోట్ల చేప పిల్లల విడుదల: కలెక్టర్

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 224 మత్స్యకార సంఘాల ఆధ్వర్యంలో 3.5 కోట్ల చేప పిల్లలను నీటి వనరుల్లో విడుదల చేస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. చెరువుల్లో ఫీడ్ సక్రమంగా అందేలా, నీరు కలుషితంగాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఖమ్మం నియోజకవర్గంలో 17 లక్షల చేప పిల్లలను ఉచితంగా విడుదల చేస్తున్నామని చెప్పారు. ప్రమాదాల్లో మృతి చెందిన కనకయ్య, మంగయ్య కుటుంబాలకు రూ.5 లక్షల బీమా చెక్కును అందజేశారు.


