News February 13, 2025

ఖమ్మం జిల్లాలో నేడు మంత్రి పొంగులేటి పర్యటన

image

ఖమ్మం జిల్లాలో నేడు (గురువారం) మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించనున్నట్లు మంత్రి  కార్యాలయ ఇన్ఛార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. నేలకొండపల్లి, కూసుమంచి, ఖమ్మం నగరం, కొణిజర్ల మండలాల్లో పర్యటించి పలు భాదిత కుటుంబాలను పరామర్శిస్తారని అన్నారు. అనంతరం పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గమనించాలని పేర్కొన్నారు.

Similar News

News March 16, 2025

రాజీవ్ యువ వికాసంపై Dy.CM భట్టి సమీక్ష

image

ప్రజా భవన్‌లో రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభంపై అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రాజీవ్ యువ వికాసం పథకం విధి విధానాలు, కావలిసిన నిధులపై చర్చించారు. ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ ఛైర్మన్లు ప్రీతం, బెల్లయ్య నాయక్, ఒబేదుల్లా కొత్వాల్, తదితరులు పాల్గొన్నారు.

News March 16, 2025

ఖమ్మం: అనుమానాస్పదంగా వివాహిత ఆత్మహత్య

image

ఓ వివాహిత తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పలు అనుమానాలకు తావిస్తోంది. ఖమ్మం జిల్లా బోనకల్ మండల పరిధిలోని ఆళ్లపాడుకు చెందిన షేక్ మస్తాన్, జరీనా(28) దంపతులు. జరీనా అప్పటి వరకు ఇంట్లో పని చేసుకుంటుండగా, విశ్రాంతి తీసుకోడానికి ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. కొంత సమయం తర్వాత ఇంట్లో వాళ్లు చూడగా, ఉరి వేసుకొని ఉంది. ఎస్ఐ మధుబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 16, 2025

ఇందిరమ్మ ప్రభుత్వంలో విద్య, వైద్యానికి పెద్ద పీట: పొంగులేటి

image

ఇందిరమ్మ ప్రభుత్వంలో విద్య, వైద్యానికి పెద్ద పీట వేస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఇల్లందు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. 58 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి రూ.200కోట్ల చొప్పున మొత్తం 11,600కోట్లను కేటాయించుకోని ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని తెలిపారు.

error: Content is protected !!