News May 3, 2024
ఖమ్మం జిల్లాలో పెరుగుతున్న పొలిటికల్ హీట్!

లోక్ సభ ఎన్నికల గడువు తేదీ దగ్గర పడుతుండడంతో ఖమ్మం జిల్లాలో ప్రచారం ఊపందుకుంది. అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని వేగవంతం చేశాయి. విమర్శలు, ప్రతి విమర్శలు చేస్తూ ఓటర్లు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బిజెపి, బీఆర్ఎస్ పార్టీలు తమ ప్రచారాలకు మరింత పదును పెట్టాయి. ఆయా పార్టీల అధినేతలు కూడా ప్రచారానికి వస్తుండడంతో జిల్లాలో పొలిటికల్ హీట్ మరింత పెరుగుతోంది.
Similar News
News October 30, 2025
ఖమ్మంలో అర్ధరాత్రి హై అలర్ట్

మున్నేరు వాగు పరివాహక ప్రాంతాలలో అర్ధరాత్రి పోలీసులు, మున్సిపల్ అధికారులు హై అలెర్ట్ ప్రకటించారు. మున్నేరు ప్రవాహనం పెరగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. బుధవారం రాత్రి 7 గంటలకు 17 అడుగుల వద్ద ఉన్న వాగు అర్ధరాత్రి 22 అడుగులకు చేరుకుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు నగరంలోని బొక్కలగడ్డ, మోతీ నగర్ ప్రాంతాలను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించారు. తెల్లవారుజామున 5 గంటలకు 23 అడుగులకు చేరుకుంది.
News October 30, 2025
ఖమ్మం: అంగన్వాడీల్లో కరువైన పర్యవేక్షణ..!

జిల్లాలో గర్భిణీలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించేందుకు ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ అధికారుల పర్యవేక్షణ లోపంతో అస్తవ్యస్తంగా మారింది. జిల్లాలోని పలు కేంద్రాల్లో చిన్నారులకు మధ్యాహ్న భోజనాన్ని సైతం పెట్టడం లేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు కేంద్రాలపై దృష్టి సారించి, మెరుగైన సేవలు అందేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
News October 30, 2025
విద్యుత్ స్తంభాల వద్ద అప్రమత్తంగా ఉండండి: SE

మొంథా తుఫాను ప్రభావంతో ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజల అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రీనివాసా చారి తెలిపారు. రైతులు పంట పొలాల వద్ద జాగ్రత్తలు పాటించాలని, పశువులను విద్యుత్ స్తంభాలకు కట్టరాదని సూచించారు. ఉరుములు, పిడుగులు సంభవించినప్పుడు విద్యుత్ లైన్స్ సమీపంలో ఉండవద్దని హెచ్చరించారు. విద్యుత్ ప్రమాదాలను నివారించేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.


