News March 6, 2025

ఖమ్మం జిల్లాలో భగ్గుమంటున్న భానుడు!

image

వేసవి కాలం ప్రారంభంలోనే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. బుధవారం రికార్డు స్థాయిలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సింగరేణి ప్రాంతంలో తీవ్రత మరింతగా ఉంది. ఉదయం 8 గంటల నుంచే బయటకు వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు. తీవ్రమైన ఎండ, వేడిగాలులు, ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. మరో 3-4 రోజుల్లో ఎండ, వేడి గాలుల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది.

Similar News

News October 22, 2025

ఆదోని ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం వాయిదా

image

ఆదోని మండల ఎంపీపీ దానమ్మపై పెట్టిన అవిశ్వాస తీర్మానం వాయిదా పడింది. 28 ఎంపీటీసీ సభ్యుల్లో కనీసం 17 మంది మద్దతు అవసరమని అధికారులు స్పష్టం చేశారు. తీర్మానానికి అవసరమైన సంఖ్య లేని కారణంగా అధికారులు అవిశ్వాసాన్ని వాయిదా వేశారు. కొన్ని రోజులుగా ఆదోనిలో ఎంపీపీ అవిశ్వాసంపై నెలకొన్న ఉత్కంఠ ఇక్కడితో శాంతించింది. ఎంపీపీగా దానమ్మ కొనసాగనున్నారు.

News October 22, 2025

జైషే మహ్మద్ మరో కుట్ర?

image

పాక్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రసంస్థ జైషే మహ్మద్ మరో కుట్రకు తెరలేపినట్లు తెలుస్తోంది. ఇటీవల ఏర్పాటైన <<17958042>>మహిళా వింగ్ <<>>కోసం రిక్రూట్‌మెంట్, నిధులు సేకరించేందుకు ఆన్‌లైన్ జిహాదీ కోర్స్ ప్రారంభించినట్లు సమాచారం. జైషే చీఫ్ మసూద్ సిస్టర్స్ సాదియా, సమైరా, మరికొందరు రోజూ 40నిమిషాలు పాఠాలు చెప్తారని తెలుస్తోంది. ఇందులో పాల్గొనేవారు 500 పాక్ రుపీస్ డొనేషన్ ఇవ్వాలంటున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

News October 22, 2025

పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేయించారా?

image

తెలుగు రాష్ట్రాల్లో పశువుల్లో ప్రమాదకరమైన గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు వేస్తున్నారు. నవంబర్ 14 వరకు అన్ని జిల్లాల్లో పశువులకు వీటిని అందించనున్నారు. 4 నెలల వయసు పైబడిన పశువులు అన్నింటికీ ఈ వ్యాక్సిన్స్ వేస్తారు. పశుపోషకుల ఇళ్ల వద్దకే సిబ్బంది వచ్చి ఉచితంగా టీకాలు అందిస్తున్నారు. పాడిరైతులు నిర్లక్ష్యం చేయకుండా పశువులకు ఈ వ్యాక్సిన్స్ వేయించాలని పశుసంవర్ధక శాఖ అధికారులు కోరుతున్నారు.