News March 6, 2025
ఖమ్మం జిల్లాలో భగ్గుమంటున్న భానుడు!

వేసవి కాలం ప్రారంభంలోనే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. బుధవారం రికార్డు స్థాయిలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సింగరేణి ప్రాంతంలో తీవ్రత మరింతగా ఉంది. ఉదయం 8 గంటల నుంచే బయటకు వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు. తీవ్రమైన ఎండ, వేడిగాలులు, ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. మరో 3-4 రోజుల్లో ఎండ, వేడి గాలుల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది.
Similar News
News March 27, 2025
వనపర్తి జిల్లాలో మండుతున్న ఎండలు..!

వనపర్తి జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. అత్యధికంగా కనాయిపల్లిలో 40.9℃ ఉష్ణోగ్రత నమోదైంది. రేమద్దుల 39.8, కేతేపల్లి 39.7, పెబ్బేరు, వెల్గొండ 39.6, గోపాలపేట 39.4, దగడ 39.3, విలియంకొండ 39.2, విపనగండ్ల 39.1, శ్రీరంగాపురం, పంగల్ 39, జనంపేట, ఆత్మకూర్ 38.9, రేవల్లి 38.8, వనపర్తి 38.7, మదనాపురం 38.6, సోలిపూర్ 38.4, పెద్దమందడి 38.1, ఘనపూర్ 37.9, అమరచింతలో 37.7℃ ఉష్ణోగ్రత నమోదైంది.
News March 27, 2025
HYD: ఏటా పెరుగుతున్న రొమ్ము క్యాన్సర్!

ఏటా రొమ్ము, గర్భాశయ సర్వైకల్ క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. HYDలోని MNJ క్యాన్సర్ ఆస్పత్రిలో 2021లో 1240 రొమ్ము క్యాన్సర్ కేసులు నమోదు కాగా.. 2024లో 1791 మంది బాధితులు దీని బారిన పడ్డారు. అదే 2021లో సర్వైకల్ క్యాన్సర్ కేసులు 1033 నమోదు కాగా.. 2024లో వాటి సంఖ్య 1262కు చేరింది. MNJ ఆస్పత్రి విస్తరించి కొత్త భవనంలోనూ క్యాన్సర్ చికిత్స అందిస్తున్నారు.
News March 27, 2025
సంగెం: బైకును ఢీ కొట్టిన లారీ.. బాలుడు మృతి

వరంగల్ జిల్లా సంగెం మండలం గవిచర్ల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకుడిని లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గవిచర్లకి చెందిన గాలి చందు (17) బైక్‌పై ఆశాలపల్లి వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో కంటైనర్ లారీ ఢీకొట్టడంతో చందు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.