News March 14, 2025
ఖమ్మం జిల్లాలో భానుడు భగ్గుమంటున్నాడు.!

ఖమ్మం జిల్లాలో వేసవి ప్రభావం ఒక్కసారిగా పెరిగింది. గురువారం మధిరలో 40.4°, (ఏఆర్ఎస్)లో 40.3°, గేట్ కారేపల్లి, సిరిపురం, ఎర్రుపాలెంలో 40.1°, వైరా, సత్తుపల్లిలో 40.0° ఉష్ణోగ్రత నమోదైంది. మరో 39 ప్రాంతాల్లో 39-39.9° మధ్య, 9 ప్రాంతాల్లో 38°, 2 కేంద్రాల్లో 37° నమోదైంది. అత్యల్పంగా కూసుమంచిలో 36° నమోదయింది, మార్చి రెండో వారంలోనే భానుడి తీవ్రత పెరగడం గమనార్హం.
Similar News
News March 15, 2025
మెగాస్టార్ చిరంజీవికి అవార్డు హర్షం వ్యక్తం చేసిన ఎంపీ

మెగాస్టార్ చిరంజీవికి యునైటెడ్ కింగ్డమ్ ప్రతిష్ఠాత్మక “లైఫ్ టైం అచీవ్ మెంట్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ సర్వీస్”పురస్కారాన్ని ప్రకటించడం పట్ల రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర హర్షం వ్యక్తంచేశారు. సినిమా హీరోగా లక్షలాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొని మెగాస్టార్ గా కీర్తించబడుతున్న చిరంజీవి బ్లడ్,ఐ బ్యాంకులు నెలకొల్పి విశేష సేవలందిస్తున్నారని ఎంపీ వద్దిరాజు పేర్కొన్నారు.
News March 15, 2025
“ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్యాంశాలు..!!

✓:మంత్రి ఉత్తమ మంత్రి తుమ్మల భేటీ✓:ఖమ్మం జిల్లాలో ఘనంగా హోలీ వేడుకలు ✓:ఖమ్మం:KCRపై సీఎం వ్యాఖ్యలు సరికాదు: MP రవిచంద్ర ✓:సత్తుపల్లి: ఆయిల్ పామ్ గెలల అపహరణ ✓:నేలకొండపల్లి:రుణాలు చెల్లించలేదని పొలాల్లో జెండాలు పాతారు! ✓:ఖమ్మం:కరుణగిరి వద్ద భారీ కొండచిలువ ప్రత్యక్షం ✓:మధిర:పేరెంట్స్,భర్త సహకారంతో లెక్చరర్ గా ✓:ఎర్రుపాలెం: అప్పులు బాధ తాళలేక రైతు ఆత్మహత్య
News March 14, 2025
ఖమ్మం: రుణాలు చెల్లించలేదని జెండాలు పాతారు!

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో పంట రుణాలు చెల్లించలేదని రైతులు పొలాల వద్ద బ్యాంక్ అధికారులు జెండాలు పాతారు. నేలకొండపల్లి మండలంలోని కోనాయిగూడెం, అరేగూడెం గ్రామాల్లో రైతులు బ్యాంకులో తీసుకున్న రుణాలు చెల్లించలేదంటూ అధికారులు గురువారం ఎర్రజెండాలు పాతారు. నేలకొండపల్లి డీసీసీబీ బ్రాంచ్ పరిధిలో దాదాపు 20 మంది రైతులు సుమారు రూ.2 కోట్ల మేర బకాయిలు తీసుకొని స్పందించకపోవడంతో జెండాలు పాతినట్లు చెప్పారు.