News May 20, 2024

ఖమ్మం జిల్లాలో భూసార పరీక్షల ఊసే లేదు!

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వానాకాలం భూసార పరీక్షల కోసం ప్రభుత్వం ప్రధాన ల్యాబ్లకు రూ.7.2 లక్షల చొప్పున నిధులు కేటాయించారు. గతంలో వర్షాధారిత ప్రాంతాల్లో 25 ఎకరాలకు ఒకటి చొప్పున సేకరించి పరీక్షలకు పంపించే వారు. ఈసారి ఎంపికైన మండలాల్లో కొద్దిమంది భూముల నుంచే నమూనాలు సేకరిస్తున్నారు. భద్రాద్రి జిల్లాలో ఇప్పటికే ఏఈఓలు మట్టి నమూనాలను సేకరించే పనిలో ఉండగా ఖమ్మం జిల్లాలో ఈ ప్రక్రియ ప్రారంభం కాలేదు.

Similar News

News December 6, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజా విజయోత్సవ కార్యక్రమాలు ∆} పలు శాఖల అధికారులతో భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} తల్లాడలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన ∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} ఇల్లెందులో ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటన ∆} మణుగూరులో మంచి నీటి సరఫరా బంద్ ∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు

News December 6, 2024

రాత్రి ఖమ్మంలో రోడ్డు ప్రమాదం UPDATE

image

ఖమ్మంలో నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో <<14801070>>ఇద్దరు <<>>చనిపోయిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం.. తిరుమలాయపాలెం మండలం పడమటితండాకు చెందిన శివరాజు(18), హర్షవర్ధన్(15) ఉదయం బైక్‌పై ఖమ్మం వచ్చారు. తిరుగు ప్రయాణంలో వీరి బైక్‌ను RTC బస్సు ఢీకొంది. ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News December 6, 2024

రామాలయం అభివృద్ధికి రూ.63 కోట్లు: ఎమ్మెల్యే తెల్లం

image

భద్రాద్రి రామాలయం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.63 కోట్లు మంజూరు చేసిందని ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు తెలిపారు. అటు ఇప్పటికే దీనికి సంబంధించి భూసేకరణ పనులు జరుగుతున్నాయని గురువారం నిర్వహించిన సమావేశంలో చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. అటు రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై నాయకులు విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.