News November 11, 2024

ఖమ్మం జిల్లాలో ముమ్మరంగా కుటుంబ సర్వే

image

ఖమ్మం జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వే ముమ్మరంగా జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా 5,71,240 లక్షల ఇళ్లు ఉండగా ఆదివారం నాటికి 30,616 ఇళ్లు మాత్రమే సర్వే చేశారు. జిల్లాలో 4,118 బ్లాక్‌లుగా విభజించగా ప్రస్తుతం 3,150 బ్లాక్‌లలో సర్వే జరుగుతుంది. 75 ప్రశ్నలతో కూడిన ఫామ్‌ను నింపడానికి దాదాపు 30 నిమిషాలు పడుతున్నట్లు తెలుస్తొంది.

Similar News

News December 5, 2025

బెల్టు షాపులపై దాడులు.. రూ.35 వేల మద్యం సీజ్

image

ఖమ్మం: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పలు మండలాల్లోని బెల్టు షాపులపై టాస్క్‌ఫోర్స్‌ బృందాలు దాడులు నిర్వహించినట్లు ఏసీపీ సత్యనారాయణ తెలిపారు. కొణిజర్ల, రఘునాథపాలెం, చింతకాని సహా 7 మండలాల్లో దాడులు నిర్వహించి, సుమారు రూ.35 వేల విలువ గల దాదాపు 600 లీటర్లు ఐఎంఎఫ్‌ఎల్ మద్యాన్ని స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

News December 5, 2025

కూసుమంచిలో అత్యధిక జీపీలు, వార్డులు

image

ఖమ్మం జిల్లాలో అత్యధిక జీపీలు, వార్డులు కూసుమంచి మండలంలో ఉన్నాయి. మండలంలో 41 జీపీలకు గాను 364 వార్డులు ఉన్నాయి. ఆ తర్వాత సింగరేణి మండలంలో 41 జీపీలు, 356 వార్డులు, తిరుమలాయపాలెం మండలంలో 40 జీపీలు 356 వార్డులు ఉన్నాయి. కూసుమంచి మండలంలో మొత్తం 50,357 మంది ఓటర్లకు గాను 24,321 మంది పురుషులు, 26,035 మంది మహిళలు ఇతరులు ఒకరు ఓటరుగా నమోదయ్యాయి.

News December 5, 2025

ఖమ్మం పెద్ద ఆస్పత్రిలో గర్భిణులకు తప్పని ప్రైవేటు బాట

image

ఖమ్మం మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో రూ.30 లక్షల విలువైన టిఫా స్కానింగ్ సేవలు నిలిచిపోయాయి. దాదాపు ఏడదిన్నరగా రేడియాలజిస్ట్ లేకపోవడంతో ఈ కీలక సేవలు అందడం లేదు. శిశువు ఎదుగుదల తెలుసుకోవాల్సిన గర్భిణులు చేసేది లేక రూ.4,000 వరకు చెల్లించి ప్రైవేటు కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. పూర్తిస్థాయి రేడియాలజిస్ట్‌ను నియమించాలని గర్భిణులు కోరుతున్నారు.