News January 2, 2025
ఖమ్మం జిల్లాలో రూ. 42 కోట్ల మద్యం అమ్మకాలు..!
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డిసెంబర్ 30, 31న భారీగా మద్యం అమ్మకాలు జరిగాయి. మొత్తం 208 దుకాణాల్లో ఒక్క రోజు అమ్మకానికి రూ.42 కోట్లు వసూళ్లయ్యాయి. ఇందులో బీర్లు 11,924, విస్కీ, బ్రాందీ ఇతర మద్యం బాటిళ్లు 29,979 కేసులు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. సాధారణ రోజుల్లో రోజుకు రూ.5 కోట్ల వరకు మద్యం అమ్ముడవుతుంది. మరికొద్ది రోజుల్లో సంక్రాంతి రాబోతుండడంతో ఇదే స్థాయిలో అమ్మకాలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు.
Similar News
News January 13, 2025
కొత్తగూడెం: సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్
కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ప్రజలు సంక్రాంతి పండగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు కలెక్టర్ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పండగ సకల సంపదలతో విరజిల్లాలని.. కుటుంబ సభ్యులంతా కలిసి ఆనందంగా జరుపుకోవాలని ఆయన అన్నారు.
News January 13, 2025
ఖమ్మం: ఉపాధి హామీ జాబ్ కార్డు ఉంటే రూ.12వేలు: డిప్యూటీ సీఎం
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంపై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డు తీసుకున్న కుటుంబం కనీసం 20 రోజులు పని చేసి ఉండి, సెంటు భూమిలేని వ్యవసాయ కూలీలకు రూ.12వేలు ఇస్తామని తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో సహచర మంత్రులతో కలిసి సమీక్ష సమావేశంలో మాట్లాడారు.
News January 13, 2025
కూసుమంచిలో 30 రోజుల్లోనే ఇందిరమ్మ మోడల్ ఇల్లు పూర్తి
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం ప్రతీ మండలంలో ఒక నమూనా ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. కాగా గత నెల 13న మంత్రి పొంగులేటి కూసుమంచి ఎమ్మార్వో ఆఫీసు దగ్గర ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేయగా నెల రోజుల్లోనే పూర్తి చేశారు. రాష్ట్రంలోనే తొలి నమునా ఇల్లు కూసుమంచిలో అందుబాటులోకి వచ్చింది. రూ.5లక్షలతో ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు కాంట్రాక్టర్ జీవన్ రెడ్డి తెలిపారు.