News February 13, 2025

ఖమ్మం జిల్లాలో రెచ్చిపోతున్న దొంగలు

image

ఖమ్మం జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. వైరా సుందరయ్య నగర్‌లో పట్టపగలే భారీ చోరి జరిగింది. ఓ వద్ధురాలి ఇంట్లో చోరబడిన దొంగలు ఆమెపై దాడి చేయడంతో పాటు ఆమె కాళ్లు, చేతులను కట్టేసి, నోటికి ప్లాస్టర్ వేసి చోరీకి పాల్పడ్డారు. పక్కా ప్రణాళిక ప్రకారమే ఈ చోరీ జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

Similar News

News December 4, 2025

కలెక్టరేట్‌లో ప్రతిష్టాపనకు సిద్ధంగా తెలంగాణ తల్లి విగ్రహం: ఖమ్మం కలెక్టర్

image

ఖమ్మం కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యిందని, విగ్రహ ప్రతిష్టాపన పనులు చివరి దశకు చేరాయని కలెక్టర్ అనుదీప్ అన్నారు. కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేస్తున్న తెలంగాణ తల్లి విగ్రహం నిర్మాణ పనులను కలెక్టర్ గురువారం పరిశీలించారు. కలెక్టరేట్‌కు మరింత ఆకర్షణ వచ్చే విధంగా విగ్రహ ఏర్పాటు ఉండాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

News December 4, 2025

ఖమ్మం: తొలి విడత ఎన్నికల్లో బరిలో నిలిచే అభ్యర్థుల ఫైనల్ లిస్ట్

image

ఖమ్మం జిల్లాలో తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో బరిలో నిలిచే అభ్యర్థుల ఫైనల్ లిస్టును గురువారం మండలాల వారీగా జిల్లా అధికారులు విడుదల చేశారు. ఏడు మండలాల్లో కలిపి 192 సర్పంచి స్థానాలకు 476, 1,740 వార్డుల స్థానాలకు 3,275 మంది పోటీ పడుతున్నారు. కొణిజర్ల S-73 W-524, రఘునాథపాలెం S-106 W-589, వైరా S-50 W-348, బోనకల్ S-46 W-414, చింతకాని S-64 W-466, మధిర S-67 W-468, ఎర్రుపాలెం S-70 W-466 ఖరారయ్యారు.

News December 4, 2025

ఖమ్మం: ఏపీ సీఎం సతీమణి వాహానం‌ తనీఖీ

image

పంచాయతీ ఎన్నికల్లో భాగంగా అధికారులు తనిఖీలను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఖమ్మం జిల్లా నాయికన్ గూడెం చెక్ పోస్టు వద్ద ఏపీ సీఎం‌ చంద్రబాబు సతీమణి భువనేశ్వరి వాహనాన్ని తనీఖీ చేశారు. హైదరాబాద్ నుంచి జంగారెడ్డిగూడెం వెళ్తుండగా ఆమె వాహనాన్ని తనీఖీ చేశారు. ఆమె వెళ్తున్న వివరాలను అధికారులు నోట్ చేసుకున్నారు.