News February 13, 2025

ఖమ్మం జిల్లాలో రెచ్చిపోతున్న దొంగలు

image

ఖమ్మం జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. వైరా సుందరయ్య నగర్‌లో పట్టపగలే భారీ చోరీ జరిగింది. ఓ వద్ధురాలి ఇంట్లో చొరబడిన దొంగలు ఆమెపై దాడి చేయడంతో పాటు ఆమె కాళ్లు, చేతులను కట్టేసి, నోటికి ప్లాస్టర్ వేసి చోరీకి పాల్పడ్డారు. పక్కా ప్రణాళిక ప్రకారమే ఈ చోరీ జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

Similar News

News October 29, 2025

దేశవాళీ వరి.. ఒకసారి నాటితే 3 పంటలు పక్కా

image

ఒకసారి నాటితే 3 సార్లు కోతకు వచ్చే ‘తులసి బాసో’ దేశవాళీ వరి రకాన్ని సాగు చేస్తున్నారు చిత్తూరు(D) పలమనేరుకు చెందిన చందూల్ కుమార్‌రెడ్డి. ఇది సువాసన కలిగిన చాలా చిన్న గింజ వరి. మంచి పోషక, ఔషధ గుణాలు కలిగి తినడానికి మధురంగా ఉంటుంది. తొలి పంట 135 రోజులకు, 2వ పంట 60 నుంచి 70 రోజులకు, 3వ పంట 45 నుంచి 50 రోజులకు కోతకు వస్తుంది. ✍️ ప్రతిరోజూ ఇలాంటి కంటెంట్ కోసం <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.

News October 29, 2025

సర్వదర్శనానికి 8 గంటల పైనే

image

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 8 నుంచి 10 గంటల సమయం పడుతుంది. ప్రస్తుతం 8 కంపార్ట్మెంట్ లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. మంగళవారం 64,065 మంది భక్తులు స్వామి వారి దర్శనం చేసుకోగా.. 25,250 మంది స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ. 3.57 కోట్లు ఆదాయం వచ్చింది.

News October 29, 2025

కర్నూలు: ‘ర్యాగింగ్ చేస్తే కఠిన చర్యలు’

image

ఇంటరాక్షన్ పేరుతో ర్యాగింగ్ చేసినా ఉపేక్షించమని మంగళవారం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. కేఎంసీలో యాంటీ ర్యాగింగ్ అవగాహన సమావేశంలో పాల్గొన్న ఎస్పీ మాట్లాడుతూ.. వైద్య విద్యార్థులు సమాజానికి సేవ చేసే గొప్ప బాధ్యత కలవారని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రిన్సిపల్ చిట్టి నరసమ్మ, సూపరిండెంట్ వెంకటేశ్వర్లు, సాయి సుధీర్, రేణుక దేవి, సీఐ శేషయ్య తదితరులు పాల్గొన్నారు.