News February 13, 2025
ఖమ్మం జిల్లాలో రెచ్చిపోతున్న దొంగలు

ఖమ్మం జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. వైరా సుందరయ్య నగర్‌లో పట్టపగలే భారీ చోరీ జరిగింది. ఓ వద్ధురాలి ఇంట్లో చొరబడిన దొంగలు ఆమెపై దాడి చేయడంతో పాటు ఆమె కాళ్లు, చేతులను కట్టేసి, నోటికి ప్లాస్టర్ వేసి చోరీకి పాల్పడ్డారు. పక్కా ప్రణాళిక ప్రకారమే ఈ చోరీ జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
Similar News
News March 28, 2025
మండపేట ఎమ్మెల్సీ తోట అధిష్ఠానంపై అలిగారా..!

వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అధిష్ఠానంపై అలిగారని పార్టీ క్యాడర్‌లో వదంతులు చక్కెర్ల కొడుతున్నాయి. 25 ఏళ్ల సీనియర్ నాయకుడు అయిన తనను కాదని కాకినాడ జిల్లా అధ్యక్ష పదవిని రాజాకు కట్టబెట్టడంపై అగ్రహంగా ఉన్నారని గుసగసలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఉత్తరాంధ్ర కో ఆర్డీనేటర్‌గా కన్నబాబుని పదవి వరించింది. దీనితో తనను నిర్లక్ష్యం చేస్తుండటంతో తటస్థంగా ఉంటున్నారని సన్నిహత వర్గాల్లో చర్చనీయంశంగా మారింది.
News March 28, 2025
మోత్కూర్: లారీ దగ్ధం

మోత్కూరు మండలం పొడిచేడు శివారులో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. టిప్పర్ లారీ మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. రాత్రి మూడు గంటల సమయంలో ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందింది. వెంటనే మోత్కూరు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 28, 2025
రోడ్లపై నమాజ్ చేస్తే పాస్‌పోర్ట్, లైసెన్స్ రద్దు: UP పోలీసులు

యూపీలో ముస్లింలకు అక్కడి పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ట్రాఫిక్‌కు, ప్రజలకు ఇబ్బంది కలిగేలా రోడ్లపై నమాజ్ చేయొద్దని తేల్చిచెప్పారు. అలాంటి పనులకు ఎవరైనా పాల్పడితే వారి పాస్‌పోర్టును, డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ‘ఈద్ ప్రార్థనల్ని మసీదులు లేదా ఈద్గాల్లోనే చేయాలి. రోడ్లపై చేసేందుకు ఎవరికీ అనుమతి లేదు. ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొన్నారు.