News February 16, 2025

ఖమ్మం జిల్లాలో BRS PINK బుక్ ఫీవర్

image

BRS నేతలపై కక్షపూరితంగా వ్యవహరించిన వారి పేర్లు పింక్ బుక్‌లో రాయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించిన విషయం విదితమే. అయితే గత 10 రోజుల కింద ఖమ్మం మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కూడా ఈ విషయమై తీవ్రంగా ధ్వజమెత్తారు. జిల్లాలో కార్యకర్తలపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని, వారి పేర్లు పింక్ డైరీలో రాస్తున్నామని, వారికి వడ్డీతో సహా చెల్లిస్తామనడం, ఇటీవల కవిత మాటలతో పింక్ బుక్ హాట్ టాపిక్‌ అయింది.

Similar News

News November 28, 2025

ఖమ్మం: ఎన్నికల విధులను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలి

image

ఎన్నికల విధులను అధికారులు ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని సాధారణ ఎన్నికల పరిశీలకులు ఖర్తడే కాళీచరణ్ సుధామ రావు అన్నారు. శుక్రవారం ఆయన జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీస్ కమిషనర్ సునీల్ దత్‌లతో కలిసి కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్, ఎంసీఎంసీ సెల్, మీడియా సెంటర్లను పరిశీలించారు. ఎన్నికల నిర్వహణపై ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు.

News November 28, 2025

తపాల శాఖ ఆధ్వర్యంలో పిలాటికల్ ఎగ్జిబిషన్

image

ఖమ్మం నగరంలో శుక్రవారం తపాలా శాఖ ఆధ్వర్యంలో పిలాటికల్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ ఎగ్జిబిషన్‌ను జిల్లాలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు సందర్శించి తపాల శాఖ స్టాంపులను ఆసక్తిగా తిలకించారు. మొత్తం 108 ప్రేముల్లో 3,456 జాతీయ, అంతర్జాతీయ స్టాంపులను అందుబాటులో ఉంచినట్లు నిర్వాహకులు తెలిపారు. పిలాటికల్ ఎగ్జిబిషన్ ద్వారా విద్యార్థులకు పరిజ్ఞానం పెరుగుతుందని పేర్కొన్నారు.

News November 28, 2025

కులాలు, మతాల మధ్య రెచ్చగొట్టే చర్యలు ఉపేక్షించబోం: ఖమ్మం సీపీ

image

పంచాయతీ ఎన్నికల్లో పోటీ చాలా తీవ్రంగా ఉంటుందని, క్రిటికల్ పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని పోలీస్ అధికారులను సీపీ సునీల్ దత్ ఆదేశించారు. కులాలు, మతాల మధ్య ఎటువంటి విద్వేషాలు రెచ్చగొట్టే చర్యలు ఉపేక్షించడం జరగదని హెచ్చరించారు. ఎక్కడ ఎటువంటి ఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు.