News March 8, 2025
ఖమ్మం జిల్లాలో TODAY టాప్‌న్యూస్!

✓కారేపల్లి: బోరు వినియోగిస్తున్న ముగ్గురిపై కేసు ✓సత్తుపల్లి: డ్రైవర్ చాకచక్యం.. తప్పిన పెనుప్రమాదం ✓ఖమ్మం: మానవత్వం చాటుకున్న మాజీ మంత్రి పువ్వాడ ✓ఖమ్మం: మహిళలకు రూ.21 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు:Dy.Cm భట్టి ✓ పెనుబల్లి:బైకుల ధ్వంసం.. తండ్రీకొడుకులపై కేసు నమోదు:ఎస్ఐ వెంకటేష్ ✓కల్లూరు: రూ.54 లక్షలు గోల్మాల్.. అధికారుల స్పందన ✓ జిల్లా వ్యాప్తంగా మహిళా దినోత్సవ సంబురాలు.
Similar News
News March 16, 2025
ఖమ్మం జిల్లాలో చికెన్ ధరలు ఇలా..

ఖమ్మం జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. చికెన్ (విత్ స్కిన్) KG రూ. 160 ఉండగా, స్కిన్లెస్ కేజీ రూ. 180 ధర పలుకుతుంది. అలాగే లైవ్ కోడి రూ. 110 మధ్య ఉంది. కాగా బడ్ ఫ్లూ ఎఫెక్ట్ తో గత నెల క్రితం భారీగా అమ్మకాలు పడిపోగా.. ప్రస్తుతం అమ్మకాలు పెరగాయని, ధర సైతం పెరిగిందని నిర్వాహకులు తెలుపుతున్నారు.
News March 16, 2025
పెనుబల్లి: మేక పంచాయితీ.. దాడి, ఫిర్యాదు.!

మేక తెచ్చిన పంచాయితీలో యువకుడికి తీవ్ర గాయాలైన ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో శనివారం చోటుచేసుకుంది. మండలానికి చెందిన కొందరు యువకులు కారులో టేకులపల్లి సాగర్ కాల్వ వద్ద ఈత కొడుతుండగా, అటుగా వచ్చిన మేకల గుంపులోని ఓ మేక కారుపై ఎక్కడంతో, పశువులు కాపరిని యువకులు కొట్టారు. అది గమనించిన స్థానికులు యువకులను కొట్టడంతో మారేష్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. యువకులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
News March 16, 2025
ఖమ్మం: ఏప్రిల్ 20 నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు వచ్చే నెల 20 నుంచి నిర్వహించనున్నట్లు డీఈఓ సోమశేఖర శర్మ, ఓపెన్ స్కూల్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ మద్దినేని పాపారావు తెలిపారు. పది, ఇంటర్మీడియట్ థియరీ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి 26వ తేదీ వరకు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 గంటల వరకు జరుగుతాయని వెల్లడించారు.