News March 2, 2025
ఖమ్మం జిల్లాలో TODAY HEADLINES

∆} ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల పర్యటన ∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ సమీక్ష ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన ∆} మధిర మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} వైరాలో ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ పర్యటన ∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు ∆} ఖమ్మం మారెమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} నాచేపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరం.
Similar News
News March 19, 2025
ఖమ్మం జిల్లాలో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు

ఖమ్మం జిల్లా మధిరలో మంగళవారం అత్యధికంగా 40.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అటు కామేపల్లి, కారేపల్లిలో 39.7, సత్తుపల్లి 39.5, వైరా 39.3, ముదిగొండ (పమ్మి) 39.3, వేంసూరు, పెనుబల్లి 38.9, నేలకొండపల్లి 38.8, రఘునాథపాలెం 38.7, కొణిజర్ల 38.2, కల్లూరు 37.2, ఖమ్మం అర్బన్ 37.9, ఖమ్మం రూరల్ (పల్లెగూడెం) 37.6, ఏన్కూరు (తిమ్మరావుపేట) 37.5డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపారు.
News March 19, 2025
ప్రత్యేక కార్యాచరణతో ఉపాధి పనుల అమలు: కలెక్టర్

ఖమ్మం: రాబోయే 10 రోజుల పాటు ప్రత్యేక కార్యాచరణతో ఉపాధి హామీ పనులను జిల్లాలో అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ ఉపాధి హామీ పనులపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో రైతులతో సంప్రదించి ఆసక్తి గల వారి పొలాల్లో ఫామ్ పాండ్ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను సూచించారు.
News March 19, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

∆} వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన ∆} ప్రశాంతంగా కొనసాగుతున్న ఇంటర్ పరీక్షలు ∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు ∆} సత్తుపల్లిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం.