News November 21, 2024

ఖమ్మం జిల్లా ప్రజలకు వైద్యాధికారుల సూచనలు

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాబోయే వారం రోజులు 15 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదుకానున్నట్లు వాతావరణశాఖ హెచ్చరించింది. ఖమ్మం జిల్లాలో 17 డిగ్రీలు, భద్రాద్రి జిల్లాలో 16 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఈ నేపథ్యంలో వైద్యులు ప్రజలకు పలు సూచనలు చేశారు. జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులు ఎక్కువగా ఉంటాయని చెప్పారు. గర్భిణులు, చిన్నపిల్లలు, వృద్ధులు, శ్వాస సమస్యలతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.

Similar News

News March 11, 2026

గత ‘ఇందిరమ్మ’ బిల్లుల గోల్‌మాల్‌.. విచారణకు ఆదేశం

image

వైఎస్ఆర్ హయాంలో కొందరు నేతలు తమకు తెలియకుండానే తమ పేర్లపై ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు డ్రా చేశారని వేంసూరు బాధితులు గ్రీవెన్స్‌లో మొరపెట్టుకున్నారు. ఈ పాత రికార్డుల వల్ల ఇప్పుడు కొత్త ఇళ్లకు తాము అనర్హులమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లావ్యాప్తంగా ఇలాంటి కేసులు వేలల్లో ఉండటంతో అధికారులు విచారణ చేపట్టారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని గృహనిర్మాణ శాఖ ఈఈ శ్రీనివాస్ నాయక్ హామీ ఇచ్చారు.

News March 11, 2026

ఖమ్మంలో రేపు జాబ్ మేళా

image

నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాల కోసం మార్చి 12న ఉదయం 10 గంటలకు ఖమ్మంలోని అర్క రెనాల్ట్ షోరూంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారిణి ఎన్.మాధవి తెలిపారు. ఫీల్డ్ సేల్స్ కన్సల్టెంట్స్, సేల్స్ టీం లీడర్స్, యూజ్డ్ కార్ ఎవల్యూటర్స్ పోస్టులకు మొత్తం 35 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ, మెకానికల్ డిప్లొమా, బీటెక్ మెకానికల్ అర్హత కలిగిన 22-33 ఏళ్ల యువత సర్టిఫికెట్ జిరాక్స్‌లతో హాజరుకావాలని సూచించారు.

News March 10, 2026

ఖమ్మం: ‘ప్రజాపాలన’ పనులపై సీఎస్‌ సమీక్ష

image

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు మంగళవారం HYD నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’పై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఖమ్మం జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ తన క్యాంపు కార్యాలయం నుంచి ఈ సమీక్షలో పాల్గొన్నారు. 99 రోజుల ప్రణాళికలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిని, ప్రజా సమస్యల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను సీఎస్‌ ఈ సందర్భంగా అధికారులకు వివరించారు.