News April 4, 2025

ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నేతలతో KCR సమావేశం..!

image

ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్‌లో శనివారం ఉ. 10 గంటలకు సన్నాహక సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ ఏర్పాట్లు, జనసమీకరణ విషయమై చర్చించనున్నారు. ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే, ఎంపీలు, జిల్లా అధ్యక్షులు, ముఖ్యనేతలు హజరుకానునన్నట్లు సమాచారం.

Similar News

News November 25, 2025

సూర్యాపేట: నామినేషన్ వేస్తే ఏకగ్రీవమే!

image

త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో నూతనకల్ మండలం పెదనెమిల జీపీలో ఓ విచిత్ర పరిస్థితి నెలకొంది. పెదనెమిల జీపీలోని 1వ వార్డు ఎస్టీ జనరల్‌కు రిజర్వ్ అయింది. అయితే గ్రామంలో ఎస్టీ వర్గానికి చెందిన ఓటరు ఒక్కరే ఉండటం విశేషం. నామినేషన్ వేసే ప్రక్రియ పూర్తయితే, వార్డు మెంబర్ ఏకగ్రీవం కానుంది.

News November 25, 2025

తిరుపతి మీదుగా బుల్లెట్ ట్రైన్

image

హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ఫైల్స్ వేగంగా ముందుకు కదులుతున్నాయి. సంబంధిత అలైన్‌మెంట్‌ను తమిళనాడు ప్రభుత్వానికి SCR పంపింది. ముందుగా గూడూరు స్టాఫింగ్ అనుకునప్పటికీ తిరుపతిలో స్టాఫింగ్ ఉండేలా ప్లాన్ చేయాలని TN ప్రభుత్వం కోరింది. త్వరలోనే ఈ DPR పూర్తి కానుంది. ఈ రెండు నగరాల మధ్య ప్రయాణం 12గంటలుండగా బుల్లెట్ ట్రైన్‌లో కేవలం 2.20 గంటల్లోనే చేరుకోవచ్చు. ఈ మార్గంలో 11.6KM సొరంగం ఉంటుంది.

News November 25, 2025

ప్రారంభమైన ఆట.. బౌలర్లే దిక్కు

image

సౌతాఫ్రికాతో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు విఫలమయ్యారు. ఇప్పుడు భారమంతా బౌలర్లపైనే ఉంది. 26 పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో SA 4వ రోజు బ్యాటింగ్ ప్రారంభించింది. ప్రస్తుతం ఆ జట్టు 314 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. SAను త్వరగా ఆలౌట్ చేయకుంటే ఇండియా ముందు కొండంత లక్ష్యం పేరుకుపోవడం ఖాయం. బౌలర్లు ఏం చేస్తారో చూడాలి మరి.