News April 4, 2025
ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నేతలతో KCR సమావేశం..!

ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్‌లో శనివారం ఉ. 10 గంటలకు సన్నాహక సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ ఏర్పాట్లు, జనసమీకరణ విషయమై చర్చించనున్నారు. ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే, ఎంపీలు, జిల్లా అధ్యక్షులు, ముఖ్యనేతలు హజరుకానునన్నట్లు సమాచారం.
Similar News
News July 6, 2025
NZB: ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పెట్టకుండా చూడాలి

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పెట్టకుండా చూడాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. శనివారం ఆయన నిజామాబాద్ కలెక్టరేట్‌లో సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడారు. నిధులు దుర్వినియోగం అయితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జనాభా ప్రాతిపదికన నిధులు ఖర్చు చేయాలని అధికారులకు సూచించారు.
News July 6, 2025
అనంతగిరిగా మార్చాలని డిమాండ్.. మీ కామెంట్ ?

వికారాబాద్ జిల్లాలో మరో కొత్త డిమాండ్ వినిపిస్తోంది. చుట్టు అడవి, గుట్టమీద అనంత పద్మనాభస్వామి కొలుదీరిన ప్రాంతానికి అనంతగిరి జిల్లాగా పేరు మార్చాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అనంతగిరి గుట్టల ప్రకృతి సోయగాలు, మూసీ నది జన్మస్థలం, ప్రముఖ పుణ్యక్షేత్రాలకు ఎంతో ప్రసిద్ధి చెందటంతో జిల్లా పేరు మార్చాలని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీనిపై మీ కామెంట్.
News July 6, 2025
భద్రాద్రి రామయ్యకు స్వర్ణతులసి పూజలు

శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో స్వామివారి ఉత్సవమూర్తులకు అర్చకులు శనివారం స్వర్ణతులసి పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున ఆలయ తలుపులు తెరిచి సుప్రభాతం పలికి ఆరాధన, ఆరగింపు, సేవాకాలం, నిత్యహోమాలు, నిత్యబలిహరణం తదితర నిత్యపూజలు చేశారు. స్వామివారి నిత్యకళ్యాణ మూర్తులను బేడా మండపానికి తీసుకువచ్చి నిత్యకళ్యాణం నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.