News March 24, 2025
ఖమ్మం: జోష్ పెంచిన బీఆర్ఎస్

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ 9స్థానాల్లో గెలిచిన విషయం తెలిసిందే. BRSలో గెలిచిన ఒక్క ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ సైతం కాంగ్రెస్లో చేరడంతో BRS ఖాళీ అయ్యింది. దీంతో ఎన్నికల తరువాత BRSనేతలు సైలెంట్ అయిపోయారు. ఇప్పుడిప్పుడే పార్టీ అధినేత ఆదేశాల మేరకు కాంగ్రెస్ వైఫల్యాలను గట్టిగానే ప్రజల్లోకి తీసుకెళుతుంది. ధర్నాలు, రాస్తారోకోలు, ప్రెస్మీట్లు పెట్టి అధికార పార్టీకి కౌంటర్లు ఇస్తోంది.
Similar News
News November 28, 2025
తాటిపర్తి: పుట్టిన రోజు వేడుకలో గొడవ.. వ్యక్తి మృతి

తాటిపర్తిలో గురువారం రాత్రి జరిగిన వాగ్వాదం విషాదంగా మారింది. శ్రీమంతుల దయ మనుమరాలు పుట్టినరోజు వేడుకల్లో రోడ్డుపై పెట్టిన బల్లను కృష్ణవేణి అనే మహిళ అటుగా వెళ్తూ బల్లలకు తగలడంతో బల్ల పడిపోయింది. దీంతో రెండు కుటుంబాల మధ్య గొడవ మొదలైంది. ఈ వాగ్వాదం జరుగుతుండగా వెంపల సూరి బాబు (59) ఆకస్మాత్తుగా కుప్పకూలి మరణించాడు. ఈ ఘటనపై గొల్లప్రోలు ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News November 28, 2025
వరంగల్: ప్రచారానికి వారమే గడువు!

పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ల ఫైనల్ తర్వాత ప్రచారానికి కేవలం వారం రోజులే గడువు ఉంది. మొదటి విడతలో డిసెంబరు 3న అభ్యర్థుల పేర్లు, గుర్తులను ప్రకటించిన అనంతరం 11న ఎన్నికలు జరుగుతాయి. సరిగ్గా 7 రోజుల్లోనే 3,500 మంది ఓటర్లను ప్రసన్నం చేసుకొవాల్సి ఉంటుంది. రాజకీయ పార్టీల గుర్తులు లేకుండా జరిగే ఎన్నికలు కావడంతో కేవలం పార్టీ కండువాలతో, తమకు కేటాయించిన సింబల్ను ఓటర్లకు చెప్పాల్సి ఉంటుంది.
News November 28, 2025
వరంగల్: తమ్మీ నమస్తే.. ఇంటికొచ్చి ఓటేసి వెళ్లు!

ఉమ్మడి వరంగల్లో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. అభర్థులు, ఆశావహులు గ్రామాల్లో తిరుగుతూ ‘బాబాయ్, చిన్నమ్మ.. నీ ఓటు నాకే వేయాలి’ అంటూ ఓటర్లకు దగ్గరవుతున్నారు. ఓటు బ్యాంకింగ్ పెంచుకోవడానికి ఉద్యోగం, ఉపాధి నిమిత్తం పట్టణాల బాట పట్టిన వారికి సైతం అభ్యర్థులు కాల్ చేసి ‘అన్నా, తమ్మీ నమస్తే. ఈసారి సర్పంచ్గా పోటీ చేస్తున్నా. ఇంటికొచ్చి ఓటేసి వెళ్లు’ అంటూ కాల్ చేసి మరీ పిలుస్తున్నారట. మీకూ కాల్ వచ్చిందా?


