News July 19, 2024

ఖమ్మం: జ్వరంతో ఆర్మీ జవాన్ మృతి

image

జ్వరంతో ఆర్మీ జవాన్ మృతి చెందిన ఘటన కారేపల్లి మండలంలో జరిగింది. కుటుంబసభ్యుల వివరాలు.. భాగ్యనగర్ తండాకి చెందిన టీ.బాలాజీ 10 సంవత్సరాలుగా ఆర్మీ జవాన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 10 రోజుల క్రితం జ్వరం వస్తుందని ఉత్తరప్రదేశ్ నుంచి స్వగ్రామమైన భాగ్యనగర్ తండాకు వచ్చాడు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని హైదరాబాదుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు.

Similar News

News October 18, 2025

రోగులపై సేవా భావాన్ని కలిగి ఉండాలి: ఖమ్మం కలెక్టర్

image

వైద్య వృత్తి పవిత్రమైందని, రోగుల పట్ల సేవా భావాన్ని వైద్యులు కలిగి ఉండాలని కలెక్టర్ అనుదీప్ అన్నారు. శనివారం కలెక్టర్, ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో నిర్వహించిన 2025-వైట్ కోట్ సెర్మనిలో పాల్గొన్నారు. వైద్య వృత్తి ఎన్నుకున్న విద్యార్థులు అకాడమిక్స్‌లో పట్టు సాధించడంతో పాటు మానవ శ్రేయస్సు కోసం ప్రయత్నించాలని, మన దగ్గర వచ్చే రోగులకు పేద, ధనిక భేదం లేకుండా వారికి చికిత్స అందించాలన్నారు.

News October 18, 2025

ఖమ్మం జిల్లా డీసీసీ పీఠమెక్కేదెవరో..?

image

ఖమ్మం జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి కోసం పలువురు పోటీ పడుతున్నారు. ఈ పదవి కోసం ఇప్పటికే 30 మంది దరఖాస్తు చేసుకోగా ఎవరిని ఎంపిక చేస్తారోనన్న ఉత్కంఠ నెలకొంది. ముగ్గురు మంత్రుల అనుచరులు ఎవరికి వారు తమకు అధ్యక్ష పదవి దక్కేలా చూడాలంటూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అమాత్యులు, ఇతర ముఖ్య నేతల ఏకాభిప్రాయంతో డీసీసీని ఎంపిక చేస్తారనే ప్రచారం జరుగుతోంది.

News October 17, 2025

ఖమ్మం జిల్లాలో రేపు విద్యాసంస్థలు బంద్

image

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రేపు విద్యాసంస్థల బంద్ ఉంటుందని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు మస్తాన్, సుధాకర్, సురేష్ తెలిపారు. బీసీల 42 శాతం రిజర్వేషన్ బిల్లును ఆమోదించకపోవడాన్ని నిరసిస్తూ రేపటి బంద్‌కు మద్దతు ప్రకటిస్తున్నట్లు శుక్రవారం నిర్వహించిన సమావేశంలో చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హక్కులను కాల రాస్తుందని వారు పేర్కొన్నారు.