News July 23, 2024
ఖమ్మం: జ్వరంతో LKG బాలుడు మృతి

తిరుమలాయపాలెం గ్రామంలో జ్వరం వచ్చి ఓ బాలుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామస్థుడు గొలుసు ఉమేశ్ కొడుకు అక్షిత్(6) LKG చదువుతున్నాడు. సోమవారం ఉదయం దాకా ఆడుకున్న బాలుడికి ఒక్కసారిగా జ్వరం సోకింది. ఫిట్స్ కూడా రావడంతో తల్లిదండ్రులు ఖమ్మంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం హైదరాబాదులోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడికి వెళ్లగా.. అప్పటికే బాలుడు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.
Similar News
News January 5, 2026
పాక్షికంగా అందుబాటులోకి ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే

ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులు తుది దశకు చేరుకోవడంతో వచ్చే నెలలో వైరా నుంచి జంగారెడ్డిగూడెం వరకు రాకపోకలను పాక్షికంగా ప్రారంభించేందుకు NHAI సిద్ధమవుతోంది. హైదరాబాద్-వైజాగ్ మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించే లక్ష్యంతో నిర్మిస్తున్న ఈ రహదారిలో మధ్య సెక్షన్ పూర్తవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కొత్త మార్గం వల్ల పాత రోడ్లపై ట్రాఫిక్ ఇబ్బందులు తప్పనున్నాయి.
News January 4, 2026
ఖమ్మం: 150 మంది డ్రైవర్లకు ఆరోగ్య పరీక్షలు

రవాణా మాసోత్సవాల సందర్భంగా ఖమ్మం జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో డ్రైవర్లకు ఉచిత ఆరోగ్య, కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 150 మంది డ్రైవర్లు పాల్గొని పరీక్షలు చేయించుకున్నారు. ఎంవీఐలు దినేష్, సుమలత, రవిచందర్, వైద్యులు గౌతమ్, నరేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. డ్రైవర్లు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సురక్షిత ప్రయాణం సాధ్యమని అధికారులు పేర్కొన్నారు.
News January 4, 2026
ఖమ్మం: సీఐటీయూ జాతీయ కౌన్సిల్ సభ్యునిగా కళ్యాణం వెంకటేశ్వర్లు

సీఐటీయూ జాతీయ కౌన్సిల్ సభ్యునిగా ఖమ్మం నగరానికి చెందిన కళ్యాణం వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు. డిసెంబర్ 31వ తేదీ నుంచి ఈ నెల 4వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో జరిగిన సీఐటీయూ జాతీయ మహాసభల్లో ఎన్నిక నిర్వహించారు. ప్రస్తుతం ఆయన సీఐటీయూ ఖమ్మం జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్నారు.


