News February 22, 2025

ఖమ్మం: టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సిద్ధం: కలెక్టర్, సీపీ

image

ఖమ్మం జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్, సీపీ సునీల్ దత్ పాల్గొన్నారు. జిల్లాలో 24 పోలింగ్ కేంద్రాలు సిద్ధంగా ఉండగా, బ్యాలెట్ బాక్సుల తరలింపు, బందోబస్తు, వెబ్‌కాస్టింగ్ ఏర్పాట్లు పూర్తయినట్లు తెలిపారు.

Similar News

News March 27, 2025

ఖమ్మం: కేంద్రమంత్రికి MP వద్దిరాజు వినతి

image

ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కేంద్ర వ్యవసాయ,రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో బుధవారం సాయంత్రం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు పామాయిల్ (ఆయిల్ ఫాం) తోటల సాగుకు అనువైన, సారవంతమైనవని మంత్రికి వివరించారు. పామాయిల్ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎంపీ మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.

News March 27, 2025

ఖమ్మం: భవనం కూలిన ఘటనలో భద్రాచలంవాసి మృతి.. (UPDATE)

image

భద్రాచలంలోని సూపర్ బజార్ సెంటర్‌లో బుధవారం <<15895820>>భవనం కూలిన ఘటన<<>>లో 9 గంటల పాటు సహాయక చర్యలు కొనసాగాయి. రాత్రి రెండు గంటల సమయంలో శిథిలాల్లో చిక్కుకున్న భద్రాచలానికి చెందిన చల్లా కామేశ్వరరావును సహాయక బృందాలు వెలికితీశాయి. కాగా, ఆ సమయంలో అతడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. శిథిలాల కింద ఉపేంద్ర అనే వ్యక్తిని కూడా గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

News March 27, 2025

ఖమ్మం: CONGRESS VS BRS.. రంగంలోకి మీనాక్షి!

image

TG కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ బుధవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాల డీసీసీ కమిటీలతో మీటింగ్ పెట్టారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నా ఎందుకు వ్యతిరేకత వస్తోందని అడిగారు. జిల్లాల వారీగా కాంగ్రెస్ పార్టీ బలంపై ఆమె చర్చించారు. కాంగ్రెస్‌పై BRS చేస్తోన్న ఆరోపణలను క్షేత్రస్థాయి నుంచే బలంగా తిప్పికొట్టాలని దిశానిర్దేశం చెసినట్లు సమాచారం. కాగా DCCలతో నేడు ఢిల్లీలో పార్టీ అధిష్ఠానం సమావేశం కానుంది.

error: Content is protected !!