News September 30, 2024
ఖమ్మం: టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు నమోదు
KMM- NLG- WGL టీచర్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ఎన్నికల సంఘం నేడు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియ నవంబర్ 6వ తేదీ వరకు కొనసాగనుందని అధికారులు తెలిపారు. నవంబర్ 23వ తేదీన ఓటరు ముసాయిదా జాబితాను ప్రకటిస్తామన్నారు. అభ్యంతరాలు స్వీకరించి ఆ తర్వాత డిసెంబర్ 30వ తేదీన తుది జాబితాను ప్రకటించనున్నట్లు చెప్పారు.
Similar News
News October 15, 2024
బాణసంచా దుకాణాల అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలి: సీపీ
ఖమ్మం జిల్లాలో బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేసుకునే వ్యాపారస్తులు అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. ఈనెల 25వ తేదీ సాయంత్రం లోపు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సంబంధిత పత్రాలతో దరఖాస్తు చేసుకొని, అనుమతి పొందాలని సూచించారు. పోలీస్ శాఖ, నగర పాలక శాఖ, అగ్నిమాపక శాఖలు నిర్దేశించిన ప్రదేశంలో మాత్రమే అనుమతితో దుకాణాలను ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు.
News October 15, 2024
కమనీయం.. భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణం
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, అభిషేకం తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం బేడా మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రామయ్య నిత్య కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.
News October 15, 2024
నేడు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వర్ష సూచన
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావం వల్ల వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాకూ హెచ్చరికలు జారీ చేసింది. ఈనెల 18 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. SHARE IT