News October 22, 2024
ఖమ్మం: ట్రాక్టర్ ఇంజిన్‌లో ఇరుక్కుని ఇద్దరి మృతి

కొనిజర్ల (M) తనికెళ్ల సమీపంలోని బోడియాతండా కట్టేబోడు బ్రిడ్జి వద్ద సోమవారం <<14419094>>ఇద్దరు <<>>మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా వైరా శాంతినగర్‌కు చెందిన సైదులు(50) బీమ్దేవ్(45) రఘునాథపాలెం నుంచి ఇనుప రాడ్ల కోసం ట్రాక్టర్‌పై వెళ్లారు. ఈక్రమంలో బోడియాతండా ప్రధాన సాగర్ కాలువపై ట్రాక్టర్ అదుపుతప్పి కాలువలోకి బోల్తా పడింది. ఈఘటనలో వారు ఇంజిన్‌లో ఇరుక్కుపోయి మృతి చెందారు.
Similar News
News December 1, 2025
ఖమ్మంలో ఎన్నికల వేడి.. ప్రత్యర్థులను తప్పించే ప్రయత్నాలు!

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. తొలి విడత నామినేషన్లు పూర్తి కావడం, రెండో విడత ప్రారంభం కావడంతో గ్రామాల్లో ఎన్నికల వేడి రాజుకుంది. తమ గెలుపుపై ప్రభావం చూపుతారని భావించిన కొందరు అభ్యర్థులు, డబ్బు లేదా ఇతర మార్గాల ద్వారా ప్రత్యర్థులను పోటీ నుంచి తప్పించే ప్రయత్నాల్లో శరవేగంగా నిమగ్నమయ్యారు.
News December 1, 2025
ఖమ్మం: నేటి నుంచి కొత్త వైన్స్.. ఎన్నికల జోష్

ఖమ్మం జిల్లాలో ఈరోజు నుంచి నూతన ఎక్సైజ్ పాలసీ కింద 116 వైన్స్ ప్రారంభం కానున్నాయి. అయితే, జనావాసాల్లో షాపుల ఏర్పాటుపై స్థానికుల నుంచి తీవ్ర అభ్యంతరాలు, ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో జమ్మిబండ వైన్స్ రద్దు కాగా, మరికొన్నింటిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. మరొకవైపు ఈ నెలలో3 విడతలుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనుండటంతో, వైన్స్ వ్యాపారులు తొలి నెలలోనే అమ్మకాలు జోరుగా సాగనున్నాయి.
News December 1, 2025
68 ఏళ్ల ఏకగ్రీవానికి ముగింపు.. తెల్దారుపల్లిలో ఈసారి ఎన్నికల్లేవ్

ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికలకు దూరమైంది. దాదాపు 68 ఏళ్లుగా (1957 నుంచి) 13 సార్లు ఏకగ్రీవంగా సర్పంచ్‌ను ఎన్నుకుని, కమ్యూనిస్టులకు కంచుకోటగా నిలిచిన ఈ గ్రామం చరిత్రలో మొదటిసారి ఎన్నికల్లో పాల్గొనడం లేదు. తెల్దారుపల్లి ఇటీవల ఏదులాపురం మున్సిపాలిటీలో విలీనం కావడంతో ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికలకు దూరమైందని అధికారులు తెలిపారు. దీంతో గ్రామంలో ఈసారి ఎన్నికల సందడి కనిపించడం లేదు.


