News May 4, 2024

ఖమ్మం: డిగ్రీ పరీక్షలు వాయిదా ప్రచారం.. అధికారుల క్లారిటీ

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు ఈనెల 6 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఓ ప్రెస్ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. స్పందించిన కేయూ అధికారులు అది ఫేక్ అని నిర్ధారించారు. పరీక్షలు యథావిధిగా ఈనెల 6 నుంచి ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

Similar News

News November 6, 2024

ఖమ్మం: గత నెలలో డయల్-100 కు ఎన్ని కాల్స్ వచ్చాయంటే?

image

సమాజంలో పెరిగిపోతున్న నేర ప్రవృత్తి నేపథ్యంలో ప్రజల దాన, మాన, ప్రాణాల రక్షణే ధ్యేయంగా ఏర్పాటైన డయల్-100 కు పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత నెలలో 4,481 కాల్స్ వచ్చాయని సీపీ సునీల్ దత్ తెలిపారు. వీటిపై 74 ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, వీటిలో మహిళలపై వేధింపులు-1, దొంగతనాలు-4, సాధారణ ఘటనలు-24, యాక్సిడెంట్లు-12, అనుమానస్పద మరణాలు-10, ఇతర కేసులు- 23 అన్నారు. డయల్-100 కు అత్యవసర సమయాల్లో మాత్రమే ఫోన్ చేయాలన్నారు.

News November 6, 2024

విష జ్వరంతో నాలుగేళ్ల చిన్నారి మృతి

image

జ్వరంతో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన బుధవారం రఘునాథపాలెంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పరికలబోడుతండాకు చెందిన సురేశ్ పెద్ద కుమార్తె కుషి(4)కి కొన్ని రోజులు నుంచి జ్వరం వస్తుండడంతో RMP వద్దనే చికిత్స చేయించారు. చిన్నారి ఆరోగ్యం విషమించడంతో చిన్నారిని ఖమ్మంలోని ఆసుపత్రికి తరలించగా ప్లేట్ లెట్స్ పడిపోవడంతో చికిత్స పొందుతూ మరణించింది. వారం రోజుల కిందటే చిన్నారి బర్త్ డే జరిపారు.

News November 6, 2024

KMM: గ్రామ పంచాయతీ ఎన్నికలు.. అందరి దృష్టి వారిపైనే..

image

కులగణన తర్వాత గ్రామ పంచాయతీ జరగనున్న సంగతి తెలిసిందే. దీని కోసం 2,3 నెలలు పట్టనుండగా గ్రామాల్లో ఆశావహులు అప్పుడే ఎన్నికల సన్నాహాల్లో మునిగి తేలుతున్నారు. కులాలు, కాలనీల వారీగా లెక్కలు వేసుకుంటున్నారు. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో గ్రామాల నుంచి పట్టణాలకు వెళ్లిన వారి వివరాలను సేకరిస్తున్నారు. ఫోన్లు చేసి మామ, బాబాయ్, అల్లుడు అంటూ వరుసలు కలుపుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు.