News August 13, 2024
ఖమ్మం: తగ్గిన మిర్చి ధర.. స్థిరంగా ఉన్న పత్తి ధర
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మంగళవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.19,500 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ.7,250 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటి కంటే ఈరోజు ఏసీ మిర్చి ధర రూ.100 తగ్గగా, పత్తి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుందని వ్యాపారస్థులు తెలిపారు.
Similar News
News September 11, 2024
నిలకడగా భద్రాచలం గోదావరి నది ప్రవాహం
భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం గడిచిన గంట నుంచి నిలకడగా కొనసాగుతోంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం 5 గంటలకు 50.5 అడుగుల వద్ద ఉన్న గోదావరి నీటిమట్టం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇక గోదావరి ప్రవాహం పెరిగే అవకాశం లేదని, ఒకవేళ పెరిగినా స్వల్పంగా పెరిగి, అనంతరం తగ్గుముఖం పడుతుందని విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
News September 11, 2024
ఖమ్మంలో ఈ నెల 12న జాబ్ మేళా…!
ఖమ్మం నగరంలోని టేకులపల్లి ప్రభుత్వ ఐటిఐ కళాశాల మోడల్ కెరీర్ నందు ఈనెల 12న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి మాధవి తెలిపారు. స్పందన స్పీహూర్తి ఫైనాన్స్ లిమిటెడ్ సంస్థ నందు ఖాళీగా ఉన్న 100 పోస్టులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 18-29 ఏళ్ళు కలిగి, ఇంటర్ విద్యార్హత కలిగిన వారు అర్హులు అన్నారు. ఉ.10 గంటలకు జరిగే జాబ్ మేళాలో విద్యార్హత పత్రాలతో హాజరు కావాలన్నారు.
News September 11, 2024
KMM: గోదావరి శాంతించాలని ప్రత్యేక పూజలు
గోదావరి శాంతించాలని జాలర్లు దక్షిణ గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నదికి చీర, జాకెట్, పసుపు, కుంకుమ సమర్పించారు. ఇదిలా ఉండగా మ.2 గంటలకు 47.1 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరుకుంది. 48 అడుగుల చేరుకుంటే రెండో ప్రమాద హెచ్చరిక అమలు చేశారు. సాయంత్రం 48 అడుగులకు దాటడంతో ఇప్పటికే రెండవ ప్రమాద హెచ్చరిక అమలులో ఉంది.