News August 18, 2024
ఖమ్మం: తమ్ముడికి రాఖీ కట్టేందుకు వెళుతూ అక్క మృతి
తమ్ముడికి రాఖీ కట్టేందుకు వెళుతూ ఓ మహిళ మృతి చెందిన ఘటన కూసుమంచిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు ప్రకారం.. కూసుమంచి మండలం చౌటపల్లికి చెందిన గాజులు మల్లమ్మ తన తమ్ముడికి రాఖీ కట్టేందుకు ఆదివారం సాయంత్రం ఖమ్మం కొత్త బస్టాండ్ చేరుకొని అక్కడ రాఖీ కొనేందుకు రోడ్డు దాటుతుండగా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మల్లమ్మ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News September 13, 2024
TGSRTC డిపో మేనేజర్లతో రీజనల్ మేనేజర్ సమీక్ష
ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజనల్ మేనేజర్ సరి రామ్ గురువారం రీజనల్ కార్యాలయంలో అన్ని డిపోల మేనేజర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో వర్షాల వల్ల క్యాన్సిల్ అయిన బస్సుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే దసరా స్పెషల్ ఆపరేషన్ గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో అన్ని డిపోలో ట్రాఫిక్ ఇన్‌ఛార్జ్‌లు, గ్యారేజ్ ఇన్‌ఛార్జ్‌లు పాల్గొన్నారు.
News September 13, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్య అంశాలు
∆} వివిధ శాఖల అధికారులతో ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
∆} భద్రాచలం వద్ద తగ్గుముఖం పడుతున్న గోదావరి
∆} మణుగూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} అశ్వారావుపేటలో ఎమ్మెల్యే జారే పర్యటన
∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
∆} నేలకొండపల్లి మండలంలో పంట నష్టంపై సర్వే
News September 13, 2024
ఖమ్మం: ఈనెల 16న వైన్ షాపులు బంద్
గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఖమ్మం జిల్లాలో ఈ నెల 16న మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. వైన్ షాపులతో పాటు రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లను మూసివేయాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాలు జారీ చేశారు. 16న ఉదయం 6 గంటల నుంచి 17 ఉదయం 6 గంటల ఆదేశాలు పాటించాలని లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.