News February 24, 2025
ఖమ్మం: తలసేమియా చిన్నారులకు రక్తదానం

కారేపల్లి: తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులకు సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. తలసేమియా చిన్నారులకు రక్తం అందించడానికి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన యువకులు స్వచ్ఛంధంగా రక్తదానం చేశారు. తలసేమియా చిన్నారుల జీవితాలను కాపాడటానికి ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
Similar News
News March 26, 2025
భద్రాచలం: భవనం కూలిన ప్రమాదానికి ఇదే కారణం?

భద్రాచలంలో హఠాత్తుగా కూలిన భవనాన్ని ట్రస్ట్ పేరుతో విరాళాలు సేకరించి నిర్మాణం చేపట్టారట. నిబంధనలకు విరుద్ధంగా అలాగే నాసిరకం పిల్లర్లతో పాత భవనంపైనే నాలుగు అంతస్తుల నిర్మాణం చేపట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అధికారులు కూడా ఈ నిర్మాణాన్ని చేపట్టవద్దని హెచ్చరించారు. అటు యజమాని పరారీలో ఉన్నట్లు సమాచారం. కాగా ఈప్రమాదంలో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే చనిపోయినట్లు తెలుస్తోంది.
News March 26, 2025
ఖమ్మం: రూ.250 కోట్లతో మరో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ

ఖమ్మంలో తొలి ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వేంసూరు మండలం కల్లూరిగూడెంలో రూ.250 కోట్లతో, 48 ఎకరాల్లో ఫ్యాక్టరీ నిర్మించనుండగా, ఈ ఉగాదికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా శంకుస్థాపన చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలో ఒక ఫ్యాక్టరీ ఉండగా, మరొకటి వేంసూరులో నిర్మిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 1.10లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగవుతుండటం గమనార్హం.
News March 26, 2025
పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన ఖమ్మం కలెక్టర్

ఖమ్మం జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. ఖమ్మం నగరంలోని రిక్కా బజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షా సెంటర్‌ను తనిఖీ చేసి, పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు. ఎండ తీవ్రత దృష్ట్యా విద్యార్థులకు చల్లని తాగునీరు సరఫరా చేయాలని, పరీక్ష కేంద్రానికి వచ్చే ప్రతి విద్యార్థినీ క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతించాలని తెలిపారు..