News February 11, 2025

ఖమ్మం: తీన్మార్ మల్లన్నకు థ్యాంక్స్: సుందర్ రాజ్

image

ఖమ్మం-వరంగల్-నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్ సోమవారం ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలందరూ తనను గెలిపించాలని ఆయన కోరారు. అదే విధంగా తీన్మార్ మల్లన్న తనకు మద్దతు తెలపడంపై చాలా సంతోషంగా ఉందని, ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, బీసీ జాతీయ అధ్యక్షుడు గజ్జల శ్రీనివాస్ ఉన్నారు.

Similar News

News October 29, 2025

సూర్యాపేట జిల్లాలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు

image

మొంథా తుపాను ప్రభావంతో జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సూర్యాపేట జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు బుధవారం సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రజలకు సూచించారు.

News October 29, 2025

NGKL: తుఫాను కారణంగా పాఠశాలలకు సెలవుపై నిర్ణయం

image

రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో స్థానిక పరిస్థితులను బట్టి పాఠశాలలను నడపలేని పరిస్థితి ఉంటే సెలవుపై నిర్ణయం తీసుకోవాలని ఎంపీడీవో, ఎంఈవోలకు డీఈవో రమేష్ కుమార్ సూచించారు. జిల్లా వ్యాప్తంగా నేడు నిర్వహించాల్సిన ఎస్ఏ (SA) పరీక్షలు వాయిదా వేశారు. తదుపరి పరీక్షల తేదీని త్వరలో ప్రకటిస్తామని ఆయన తెలిపారు.

News October 29, 2025

కొత్తగూడెం జిల్లాలో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు

image

మొంథా తుపాను దృష్ట్యా కొత్తగూడెం జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ప్రజలు అత్యవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని ఆయన సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.