News February 11, 2025
ఖమ్మం: తీన్మార్ మల్లన్నకు థ్యాంక్స్: సుందర్ రాజ్

ఖమ్మం-వరంగల్-నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్ సోమవారం ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలందరూ తనను గెలిపించాలని ఆయన కోరారు. అదే విధంగా తీన్మార్ మల్లన్న తనకు మద్దతు తెలపడంపై చాలా సంతోషంగా ఉందని, ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, బీసీ జాతీయ అధ్యక్షుడు గజ్జల శ్రీనివాస్ ఉన్నారు.
Similar News
News March 15, 2026
BREAKING: ఖమ్మం: విద్యుత్ షాక్‌తో పంచాయతీ సెక్రటరీ మృతి

కరెంటు షాక్ తగిలి పంచాయతీ కార్యదర్శి మృతి చెందిన విషాద ఘటన ఉదయం కారేపల్లిలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఏన్కూరు మండలం తిమ్మారావుపేట కార్యదర్శిగా పనిచేస్తున్న సురేష్ కారేపల్లిలోని తన నివాసంలో ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో ఆయన స్వగ్రామంతో పాటు విధులు నిర్వర్తిస్తున్న గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
News March 15, 2026
ఖమ్మం: యుద్ధ మేఘాలు.. వంట గదిలో మంట

అంతర్జాతీయ యుద్ధ పరిస్థితులు సామాన్యుడి వంట గదిపై పెనుభారం మోపుతున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు, దిగుమతులు తగ్గడంతో వంట నూనెల ధరలకు రెక్కలు వచ్చాయి. నెల క్రితం రూ.155 ఉన్న సన్‌ఫ్లవర్ ఆయిల్ రూ. 180కు, రూ. 110 ఉన్న పామాయిల్ రూ.135కు చేరింది. వేరుశనగ, కొబ్బరి నూనెల ధరలు కూడా భారీగా పెరగడంతో మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. నిత్యావసరాల ధరల పెరుగుదలపై జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
News March 15, 2026
ఖమ్మం: పరీక్షల్లో నిర్లక్ష్యం.. సిబ్బందిపై వేటు

పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు. DEO చైతన్య జైని కొణిజర్ల జడ్పీహెచ్‌ఎస్ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు. గేట్లు తెరిచి ఉంచడం, అపరిచితులను అనుమతించడం గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు. చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్ అధికారి, ఇన్విజిలేటర్‌ను విధుల నుంచి తొలగించి వారి స్థానంలో ఇతరులను నియమించారు. విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలుంటాయని హెచ్చరించారు.


