News February 11, 2025
ఖమ్మం: తీన్మార్ మల్లన్నకు థ్యాంక్స్: సుందర్ రాజ్

ఖమ్మం-వరంగల్-నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్ సోమవారం ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలందరూ తనను గెలిపించాలని ఆయన కోరారు. అదే విధంగా తీన్మార్ మల్లన్న తనకు మద్దతు తెలపడంపై చాలా సంతోషంగా ఉందని, ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, బీసీ జాతీయ అధ్యక్షుడు గజ్జల శ్రీనివాస్ ఉన్నారు.
Similar News
News February 11, 2026
సూర్యాపేట: ముగిసిన పోలింగ్.. 77.92 శాతం నమోదు

సూర్యాపేట జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 77.92 శాతం ఓటింగ్ నమోదైనట్లు కలెక్టర్ తేజస్ వెల్లడించారు. మొత్తం 2,19,912 మంది ఓటర్లకు గానూ 1,71,359 మంది తమ హక్కును వినియోగించుకున్నారు. అత్యధికంగా తిరుమలగిరిలో 88.35 శాతం, అత్యల్పంగా హుజూర్‌నగర్‌లో 60.88 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు.
News February 11, 2026
గోడపై క్యాలెండర్ మారుతున్నా జాబ్ క్యాలెండర్ రాదు: షర్మిల

AP: గవర్నర్ బడ్జెట్ ప్రసంగమంతా అవాస్తవాలు, కల్పితాలేనని APCC చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. ‘కూటమి సూపర్ సిక్స్ హామీలు సూపర్ ప్లాప్ అయ్యాయి. మెగా డీఎస్సీని దగా చేశారు. గోడపై క్యాలెండర్లు మారుతున్నా జాబ్ క్యాలెండర్ మాత్రం రావడం లేదు. అన్నదాత సుఖీభవ కింద 40 లక్షల మంది రైతులకు టోకరా పెట్టారు. రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షల ఉద్యోగాలు అంతా ఫేక్’ అని ధ్వజమెత్తారు.
News February 11, 2026
రాయికల్‌లో 74.96 శాతం ఓటింగ్ నమోదు

రాయికల్ మున్సిపాలిటీలో పోలింగ్ ప్రక్రియ బుధవారం ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల సమయానికి పట్టణవ్యాప్తంగా 74.96 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. మొత్తం 12 వార్డుల్లోని 13,084 మంది ఓటర్లకు గాను 9,808 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్త్రీలు 5558, పురుషులు 4250 మంది ఓటేశారు.


