News April 2, 2024
ఖమ్మం: తీవ్ర ఎండల నేపథ్యంలో హెల్ప్ సెంటర్ ఏర్పాటు

ఖమ్మం జిల్లాలోని డీఎంహెచ్వో కార్యాలయంలో ప్రత్యేకంగా 24 గంటల పాటు పని చేసేలా హెల్ప్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఎవరైనా వడదెబ్బకు గురైనా, ఎండకు అపస్మారక స్థితికి చేరుకున్నా సమాచారాన్ని జిల్లా కేంద్రంలోని 8501003838, 8639522447 నంబరుకు తెలియజేస్తే తక్షణమే అందుబాటులో ఉన్న అంబులెన్సుతో పాటు వైద్య చికిత్సలకు దగ్గరలోని పీహెచ్సీకి తరలించి చికిత్సలు అందిస్తామని జిల్లా వైద్యాధికారులు తెలియజేశారు.
Similar News
News December 4, 2025
ఖమ్మం: కేంద్రమంత్రిని కలిసిన బీఆర్ఎస్ ఎంపీ

తెలంగాణలో పెండింగ్లో ఉన్న పలు జాతీయ రహదారులకు నిధులు కేటాయించాలని, నిర్మాణ దశలో ఉన్న రహదారులను తక్షణమే పూర్తి చేయాలని కోరుతూ కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని రాజ్యసభ ఎంపి వద్దిరాజు వినతిపత్రం అందజేశారు. పార్లమెంట్లోని ఆయన ఛాంబర్లో కలిసి విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన గడ్కరీకి సమస్యలను పరిష్కారిస్తామని హామినిచ్చారు.
News December 4, 2025
అటవీ భూముల ఆక్రమణను అనుమతించవద్దు: ఖమ్మం కలెక్టర్

ఖమ్మం జిల్లాలోని అటవీ భూముల ఆక్రమణకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించవద్దని కలెక్టర్ అనుదీప్ స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన అటవీ సంరక్షణ కమిటీ సమావేశంలో కలెక్టర్, DFO సిద్ధార్థ్ విక్రమ్ సింగ్తో కలిసి పాల్గొన్నారు. అటవీ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉంటూ అటవీ భూమి అన్యాక్రాంతం కాకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ పేర్కొన్నారు.
News December 4, 2025
ఖమ్మం: ఎన్నికల్లో ఘర్షణలు జరగకుండా చూడాలి: సీపీ

పంచాయతీ ఎన్నికలు ఎటువంటి ఘర్షణలకు తావు లేకుండా పోలీసు అధికారులు క్షేత్రస్థాయిలో నిశితంగా పర్యవేక్షించాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచించారు. పోలీస్ స్టేషన్ సెక్టర్ అధికారులు, స్టేషన్ హౌస్ ఆఫీసర్స్తో వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా గ్రామపంచాయతీ ఎన్నికల బందోబస్త్పై ఆయన సమీక్ష నిర్వహించారు. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా, ఆరోపణలకు ఆస్కారం ఇవ్వకుండా పోలీసులు పనిచేయాలన్నారు.


